చెరువు పాలైన రెండు వేల ఆధార్ కార్డులు - MicTv.in - Telugu News
mictv telugu

చెరువు పాలైన రెండు వేల ఆధార్ కార్డులు

May 18, 2019

ప్రస్తుత రోజుల్లో ఆధార్ కార్డు ఎంత ముఖ్యమైనదో అందరికీ తెలిసిందే. ఏ పనికైనా ఆధార్ కార్డు తప్పనిసరి అయిపోయింది. అలాంటి రెండు వేల ఆధార్ కార్డులు ఓ నది ఒడ్డున పడున్న ఘటన కలకలం రేపుతోంది.

Big negligence: Two thousand base cards were thrown in the siege on the river, know where it is

తమిళనాడులోని తిరుప్పూరు జిల్లాలోని ముళ్లియార్ నది ఒడ్డున కుప్పలు తెప్పలుగా పడున్న ఆధార్ కార్డులతో పిల్లలు ఆడుకుంటున్న విషయాన్ని స్థానికులు గుర్తించారు.

వెంటనే రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు.

హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న రెవెన్యూ అధికారులు.. పోస్టాఫీస్ సిబ్బంది విఫలంతోనే ఈ ఘటన జరిగినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.