Big news for Uttarandhra .. Coral reefs on the coast
mictv telugu

ఉత్తరాంధ్రకు బిగ్ న్యూస్.. తీరంలో పగడపు దిబ్బలు

June 25, 2022

 

ఇప్పటివరకు పగడపు దిబ్బలంటే విదేశాల్లో ఉంటాయనుకున్నాం. అప్పుడప్పుడూ సినిమాల్లో వాటి ప్రస్తావన, కొన్ని సన్నివేశాల్లో వాటి దృష్యాలు చూసి మురిసిపోతుంటాం. కానీ, అవే పగడపు దిబ్బలు మన దగ్గర కూడా ఉన్నాయని తెలిస్తే.. ఇప్పుడు ఆ విషయాన్నే కన్పామ్ చేసింది జువలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. ఉత్తరాంధ్ర తీరంలో చేసిన పరిశోధనలో పగడపు దిబ్బలు ఉన్నాయని ఆ సంస్థ రూపొందించిన రిపోర్టులో వెల్లడైంది. అనకాపల్లి జిల్లా పూడిమడక నుంచి విజయనగరం జిల్లా చింతపల్లి వరకు ఉన్న తీరంలో సర్వే నిర్వహించిన సంస్థ.. ఆ ప్రాంతం అంతా భిన్నమైన జాతుల సముదాయం ఉందని గుర్తించింది. తీరంలో 30 మీటర్ల లోతులో అన్వేషించగా, పూడిమడక కేంద్రంగా దిబ్బలు ఉన్నట్టు గుర్తించారు. ముఖ్యంగా లభ్యమైన వాటిలో డిస్కోసోమా, లోబాక్టిస్, హెక్సకోరిలియా, ఆక్టోటోరిలియా, పపోనా ఎస్పీ, స్కెలరాక్టినియా కోరల్స్, లిథోపిలాన్‌ ఎస్‌పీ, మోంటీపోరా ఎస్‌పీ, పోరిటెస్‌ ఎస్‌పీ వంటివి మెడిసిన్స్ తయారీలో ఉపయోగపడతాయని పరిశోధనలో తేలింది. కాగా, ఈ విషయం తెలుసుకొని ఉత్తరాంధ్ర తీర ప్రాంత ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. రోజూ చూసే సముద్ర తీరంలో ఇంత అందం ఉందా అని చర్చించుకుంటున్నారు.