చైనాకు అమెరికా బిగ్ షాక్.. దిగుమతులపై నిషేధం  - MicTv.in - Telugu News
mictv telugu

చైనాకు అమెరికా బిగ్ షాక్.. దిగుమతులపై నిషేధం 

September 23, 2020

Big news: Now Chinese goods trade will stop in America

చూస్తుంటే చైనాతో అమెరికా పూర్తిగానే కటీఫ్ కావాలని భావిస్తున్నట్టుంది. చైనా యాప్‌లు టిక్‌టాక్, వీచాట్ నిషేధం వైపు ట్రంప్ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా చైనా నుంచి వస్తువులను దిగుమతి చేసుకోవడాన్ని నిషేధిస్తూ అమెరికా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అమెరికా ప్రతినిధుల సభ ఏకగ్రీవ బిల్లుకు ఆమోదం తెలిపింది. ఆర్థిక ప్రభావంపై ఆందోళనల అనంతరం ఈ బిల్లును ఆమోదించారు. బిల్లుకు సభలో సానుకూలంగా 406 ఓట్లు రాగా.. ముగ్గురు సభ్యులు వ్యతిరేకించారు. వాయవ్య చైనాలోని జిన్జియాంగ్ ప్రాంతంలో ఉయ్గర్, ఇతర జాతి మైనారిటీ వర్గాల బాండెడ్ కార్మికులను గృహ నిర్బంధంలో ఉంచి ఈ వస్తువులను తయారు చేస్తున్నారు. అలాంటి వస్తువులను అమెరికాలోకి దిగుమతి చేసుకోకుండా ఈ బిల్లులోని నిబంధనలు ఉన్నాయి. పది లక్షలకు పైగా ఉన్న ఉగుహార్, ఇతర ముస్లిం సమాజాన్ని నిర్బంధంలోంచి బయటకు తీసుకురావడానికి చైనాపై ఒత్తిడి తీసుకోవలసిన అవసరం ఉందని యూఎస్ కాంగ్రెస్ సభ్యులు చెప్పినట్లు సమాచారం. 

అమెరికా, యూరప్ వంటి ప్రముఖ వాణిజ్య భాగస్వాములతో పోలిస్తే విదేశీ మార్కెట్లలో చైనా వస్తువుల అమ్మకాలు వేగంగా అభివృద్ధి చెందాయి. వస్తువులను చవకగా అందిస్తూ చైనీస్‌ దేశీయ పరిశ్రమల వ్యయంతో తరచుగా మార్కెట్‌ను నింపడంతో భారతదేశంతో వాణిజ్యం కూడా ఏకపక్షంగా తయారైంది. కాగా, ఇప్పటికే ట్రంప్ ప్రభుత్వం హువావే, జెడ్‌టీఈ, డ్రోన్ నిర్మాత డీజేఐలతో పాటు చైనాకు చెందిన 275కి పైగా సంస్థలను బ్లాక్ లిస్ట్‌లో పెట్టింది. మరోవైపు జిన్జియాంగ్ ప్రావిన్స్‌లో నివసిస్తున్న ఉయ్ఘర్ మైనారిటీలను అణచివేయడంపై నిఘా కెమెరా తయారీదారు హిక్‌విజన్‌ను నిషేధించబడిన జాబితాలో ఉంచారు. దక్షిణ చైనా సముద్రంలో వివాదాస్పద ద్వీపాలలో చైనా సైనిక నిర్మాణానికి సహాయం చేసినందుకు కొన్ని నిర్మాణ సంస్థలను కూడా ఆంక్షల జాబితాలో ఉంచింది. మరోవైపు మిలియన్ల మంది అమెరికా పౌరుల వ్యక్తిగత డేటాకు ప్రాముఖ్యత కలిగిన ప్రముఖ షార్ట్ వీడియో యాప్ టిక్‌టాక్‌ను విక్రయించడానికి బైట్‌ డాన్స్‌కు 90 రోజులు గడువు ఇస్తూ ట్రంప్ ఆగస్టు 14న ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వుపై సంతకం చేశారు.