వరల్డ్ లోనే అతిపెద్ద రెక్కల విమానం..! - MicTv.in - Telugu News
mictv telugu

వరల్డ్ లోనే అతిపెద్ద రెక్కల విమానం..!

June 2, 2017


ప్రపంచంలోనే అతిపెద్ద రెక్కలున్న విమానం స్ట్రాటోలాంచ్ తొలిసారిగా బయటకు వచ్చింది. అమెరికాలోని కాలిఫోర్నియా ఎడారుల్లో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు పాల్ అలెన్ తయారు చేశాడు. దీని రెక్కల నిడివి 385 అడుగులు..ఎత్తు 50 అడుగులు. ఇంధనం లేకుండానే దాని బరువు 226 టన్నులు. ఇంధన సామర్థ్యం 113 టన్నులు. ఈ విమానానికి 28 చక్రాలు, 747 జెట్ సామర్థ్యంతో సమానమైన ఆరు ఇంజిన్లు ఉన్నాయి. రాకెట్లను భూమికి 52కిలోమీటర్ల పైవరకు తీసుకెళ్లి, అక్కడినుంచి అంతరిక్షంలోకి ఈ విమానం ప్రయోగిస్తుంది.