ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ తీసుకువచ్చిన ముసాయిదా నోటిషికేషన్ ను అలహాబాద్ హైకోర్టు తీరస్కరించింది. ఓబీసీలకు రిజర్వేషన్ లేకుండానే అర్బన్ లోకల్ బాడీ ఎన్నికలను నిర్వహించాలని డివిజన్ బెంచ్ తీర్పు ఇచ్చింది. ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ డిసెంబర్ 5న ముసాయిదా నోటిఫికేషన్ ను జారీ చేసింది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం. ఇక్కడ 200 మున్సిపల్ కౌన్సిల్ లో 54 ఛైర్ పర్శన్ సీట్లు ఓబీసీలకు కేటాయిస్తూ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఇచ్చింది. అందులో 18 స్త్రీలకు కేటాయించింది.
అలాగే 545 నగర పంచాయితీల్లో 147 సీట్లు ఓబీసీ అభ్యర్ధులకు రిజర్వేషన్లు కల్పించింది. అందులో 49 మహిళలకు కేటాయించారు. దీనిపై పిటిషనర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ట్రిపుల్ టెస్ట్ ఫార్ములాను కాదని నోటిఫికేషన్ జారీ చేశాని పిటిషనర్లు కేసు వేశారు. రిజర్వేషన్లు కల్పించేముందు ఓబీసీల వెనుకబాటుపై కమిషన్ ఏర్పాటు చేయాలన…దానిని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం పట్టించుకోలేదని పిటిషనర్లు వాదించారు. అయితే తాము రాపిడ్ సర్వే నిర్వహించాకనే నోటిషికేషన్ వేశామని అక్కడి ప్రభుత్వం సమర్ధించుకుంది. ముందు డివిజన్ బెంచ్ కేసును వాయిదా వేసినా ఈ రోజు మాత్రం ఈ నోటిఫికేషన్ చెల్లదని తీర్పును ఇచ్చింది.