'డీజే టిల్లు' హీరోయిన్‌కు బిగ్ షాక్..ఆమె స్థానంలో
టాలీవుడ్‌లో ఇటీవలే విడుదలైన 'డీజే టిల్లు' అనే సినిమా ఎంతంటి విజయాన్ని సాధించిందో అందరికి తెలిసిందే. ఈ సినిమాలో హీరోగా సిద్దు జొన్నలగడ్డ నటించగా, హీరోయిన్‌గా నేహా శెట్టి (రాధిక) నటించింది. రాధిక పాత్రలో నేహా శెట్టి తన నటనతో, అందంతో యువతను తెగ ఆకట్టుకుంది. ఈ క్రమంలో రాబోయే డీజే టిల్లు పార్ట్-2లో కూడా రాధిక పాత్ర ఇంకెంత అందంగా ఉంటుందో అని ప్రేక్షకులంతా ఎదురుచూస్తుండగా, ఓ వార్త నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.
రాబోయే డీజే టిల్లు పార్ట్-2 సినిమాలో సిద్దూ జొన్నలగడ్డకు జోడీగా నేహా శెట్టికి బదులుగా మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరణ్ నటించనుందని నెటిజన్స్ తెగ చర్చించుకుంటున్నారు. ఇదివరకే రౌడీ బాయ్స్ చిత్రంతో రొమాన్స్ డోస్ పెంచిన అనుపమ.. ఈ చిత్రానికి ఓకే చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. ప్రస్తతం అనుపమ టాలీవుడ్‌లో బిజీ బిజీగా ఉంది. తాజాగా నిఖిల్‌తో ’18పేజీస్’,‘బటర్‌ఫ్లై’ అనే చిత్రల్లో నటిస్తుంది. వైరల్ అవుతున్న ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ, ఇదే నిజమైతే, నేహా శెట్టికి బిగ్ షాక్ తగినట్లైవుతుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.