బిగ్ షాక్.. పెట్రోల్ ధర రూ.12 పెంపు! - MicTv.in - Telugu News
mictv telugu

బిగ్ షాక్.. పెట్రోల్ ధర రూ.12 పెంపు!

March 4, 2022

dfgbd

వాహనదారులకు బిగ్ షాకు తగలనుంది. త్వరలోనే పెట్రోల్, డీజీల్ రేట్లు ఏకంగా రూ. 12 పెరగనున్నాయి. గత నాలుగు నెలలుగా స్థిరంగా ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలకు రెక్కాలు రానున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికలు సైతం మార్చి 7తో ముగుస్తున్నందున ఆ మరుసటి రోజు నుంచే ధరలు సవరించేందుకు ప్రభుత్వం అనుమతిచ్చినట్లు సమాచారం.

దీంతో పెట్రోల్, డీజిల్‌పై లీటరు రూ.12 వరకు పెరిగే అవకాశం ఉంది. అయితే, ఈ పెంపు దశలవారీగా ఉండాలని చమురు సంస్థలకు ప్రభుత్వం సూచించినట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్‌పై రష్యా దాడి నేపథ్యంలో అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు భగ్గుమంటున్నాయి. బ్యారెల్ చమురు ధర గురువారం ఏకంగా 120 డాలర్లకు చేరగా, గురువారం 111 డాలర్లకు తగ్గింది.

అయితే, యూపీ, పంజాబ్ వంటి ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా ధరలను సవరించే వీలున్నప్పటికీ చమురు సంస్థలు ఆ పనిచేయలేదు. మార్చి 1న చివరి విడత పోలింగ్ పూర్తి కానుంది. మార్చి 10న ఫలితాలు వెలువడనున్నాయి. ఇప్పటికే అంతర్జాతీయంగా పెరిగిన చమురు ధరల కారణంగా చమురు సంస్థలు నష్టాలను ఎదుర్కొంటున్నాయి. తమ మార్జిన్లు కోల్పోకుండా ఉండాలంటే పెట్రోల్, డీజిల్ పై మార్చి 16వ తేదీలోపు పెట్రోల్, డీజిల్ ధరలు కనీసం 12 రూపాయల మేర పెంచాల్సి ఉంటుందని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ పేర్కొంది.