TikTok : చైనా యాప్ టిక్‎టాక్‎కు బిగ్ షాక్..భారత్ , కెనడాతోపాటు పలు దేశాల్లో నిషేధం..! - Telugu News - Mic tv
mictv telugu

TikTok : చైనా యాప్ టిక్‎టాక్‎కు బిగ్ షాక్..భారత్ , కెనడాతోపాటు పలు దేశాల్లో నిషేధం..!

March 2, 2023

చైనా యాప్ టిక్ టాక్ మళ్లీ బ్యాన్ అయ్యింది. ఇప్పటికే భారత్ లోపాటు పలు దేశాల్లో టిక్‎టాక్‎ను నిషేధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కెనడాలో కూడా బ్యాన్ అయ్యింది. యూజర్ల ప్రైవసీ, జాతీయ భద్రతకు సంబంధించిన ఆందోళనలను ఉటంకిస్తూ కెనడా టిక్‎టాక్ యాప్ బ్యాన్ విధించింది. ఈయాప్ వినియోగదారుల గోప్యతకు విరుద్ధంగా ఉన్నందున నిషేధం విధించినట్లు కెనడా ప్రభుత్వం తెలిపింది. టిక్ టాక్ చైనీస్ యాప్ కావడంతోపాటు యూజర్ల డేటాకు చైనా ప్రభుత్వం, యాక్సెస్ కలిగి ఉండవచ్చన్న ఆందోళనల మధ్య కెనడా ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది.

చైనా కంపెనీ బైట్ డాన్స్ యాజమాన్యంలోని టిక్‎టాక్, చైనా ప్రభుత్వంతో డేటా షేర్ చేసుకోవడం లేదని, దాని డేటా చైనాలో లేదని చెబుతోంది. ఇది సోషల్ మీడియా కంపెనీల కంటే ఈ యాప్ ఎక్కువ యూజర్ డేటాను సేకరిస్తుందన్న ఆరోపణలన్నింటినీ కంపెనీ ఖండించింది. దీంతో పాటుగా కంపెనీ తన స్వంత మేనేజ్ మెంట్ ద్వారా స్వతంత్రంగా నడిపిస్తుందని వివరించింది. తైవాన్ లో డిసెంబర్ 2022లో టిక్ టాక్ జాతీయ భద్రతకు భంగం కలిగిస్తుందని ఎఫ్బిఐ హెచ్చరించడంతో ఆ దేశం నిషేధం విధించింది.

అమెరికా డేటా భద్రతాపై సమస్యలు వస్తున్నాయన్న ఆరోపణలతో అక్కడ కూడా టిక్ టాక్ పై నిషేధం విధించింది. అంతేకాదు యూరోపియన్ దేశాల్లోనూ టిక్ టాక్ ను నిషేధించాయి.

Read Also : ఎయిర్‎ఫోర్స్‎లో అగ్నివీర్ కావడానికి సువర్ణావకాశం..రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ రిలీజ్, అమ్మాయిలుకూ అవకాశం !