రైతులకు బిగ్‌షాక్.. పెరిగిన ఎరువుల ధర - MicTv.in - Telugu News
mictv telugu

రైతులకు బిగ్‌షాక్.. పెరిగిన ఎరువుల ధర

March 12, 2022

raith

రష్యా – ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా ఇప్పటికే మార్కెట్లో ధరలు మండిపోతున్నాయి. రోజురోజుకు ధరలు రెట్టింపు అవుతూ సామాన్య ప్రజలను షాక్‌కు గురిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో యుద్ధం కారణంగా యూరియా ధరలు పెరిగాయి. రష్యాపై ప్రపంచ దేశాలు ఆంక్షలు విధించడం, అక్కడి నుంచి ఎరువుల సరఫరా ఆగిపోయింది. దీంతో ప్రపంచ మార్కెట్లలో వాటి ధరలు అమాంతం పెరిగిపోయాయి. దాంతో పాటు ప్రపంచ ఆహార ద్రవ్యోల్బణం తీవ్రమైంది.

ద గ్రీన్ మార్కెట్స్ నార్త్ అమెరికన్ ఫెర్టిలైజర్ సూచీ ఒకేసారి 16 శాతం రికార్డ్ స్థాయికి ఎగబాకింది. న్యూ ఓర్లాన్స్‌లో యూరియా ధర 22 శాతం పెరిగింది. బ్రెజిల్‌లో పొటాష్ ధర 34 శాతం ఎగబాకింది. వివిధ దేశాలకు రష్యా అతి తక్కువ ధరకు ఎరువులను సరఫరా చేస్తుంటుంది. ఆంక్షల నడుమన ఎగుమతులను ఆపేయాలని, దేశ అవసరాలకు మాత్రమే నిల్వలను ఉంచాలని రష్యా ఇప్పటికే ఆదేశాలను జారీ చేసింది. ఈ నేపథ్యంలో యూరప్ దేశాలతో పాటు అన్ని దేశాలకు ఎగుమతులు ఆగాయి. ఎరువుల ధరలతో పాటు ఆహార ధాన్యాల ధరలూ భారీగా పెరుగుతున్నాయి. గోధుమలు, మొక్కజొన్న, జొన్నలు, తృణ ధాన్యాల ధరలు ఎక్కువయ్యాయి.

మరోపక్క ఎరువుల విషయంలో 85 శాతం దిగుమతులు బ్రెజిల్‌పైనే ఆధారపడుతోంది. అందులోనూ సింహభాగం రష్యా నుంచే వస్తుంది. నత్రజని, పొటాష్ దిగుమతులు 90 శాతం రష్యా నుంచే వస్తాయి. ఈ క్రమంలోనే స్థానికంగా ఎరువుల ఉత్పత్తిని ప్రారంభించాలని, 2050 నాటికి దిగుమతులను 45 శాతం తగ్గించుకోవాలని భావిస్తోంది.