జగ్గారెడ్డికి బిగ్ షాక్.. బాధ్యతల నుంచి తొలగింపు - MicTv.in - Telugu News
mictv telugu

జగ్గారెడ్డికి బిగ్ షాక్.. బాధ్యతల నుంచి తొలగింపు

March 21, 2022

సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డికి ఆ పార్టీ పెద్ద షాక్ ఇచ్చింది. ఆయనకు గతంలో అప్పగించిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతల నుంచి తప్పించింది. అలాగే, పార్లమెంట్ నియోజకవర్గాల బాధ్యతలు, అనుబంధ సంఘాల బాధ్యతల నుంచి కూడా తప్పించింది. జగ్గారెడ్డి బాధ్యతలను మిగతా వర్కింగ్ ప్రెసిడెంట్లయిన అంజన్ కుమార్ యాదవ్, అజారుద్దీన్, మహేష్ గౌడ్‌లకు రేవంత్ రెడ్డి అప్పగించారు. కాగా, ఇటీవల జగ్గారెడ్డి రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, తన మీద ఇంకో అభ్యర్థిని నిలబెట్టి దమ్ముంటే గెలిపించాలని వ్యాఖ్యానించారు. అంతేకాక, తనను సస్పెండ్ చేసే ధైర్యం ఎవ్వరికీ లేదని, షోకాజ్ నోటీసు వస్తే సమాధానం చెప్తానని తెలిపారు. ఈ నేపథ్యంలో పార్టీ హైకమాండ్ ఆదేశాల మేరకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి జగ్గారెడ్డిపై చర్యలు తీసుకున్నారు.