Big shock to Pepsi and Coca-Cola..Campa Cola will come again
mictv telugu

పెప్సీ,కోకాకోలాకు బిగ్‌షాక్‌..మళ్లీ కంపా కోలా వచ్చేస్తుంది

August 31, 2022

రిలయన్స్ రిటైల్ వెంచర్ లిమిటెడ్ డైరెక్టర్ ఈశా అంబానీ తాజాగా ఓ విషయాన్ని వెల్లడించారు. ఈ ఏడాది ఎస్ఎంసీజీ వ్యాపారంలోకి రిలయన్స్ అడుగు పెట్టబోతుందని ప్రకటించారు. ప్రకటించి, రెండు రోజులు గడవక ముందే తాజాగా ఓ వార్త వెలుగులోకి వచ్చింది. ఒకప్పటి పాపులర్‌ కూల్‌ డ్రింక్‌ అయిన కాంపా కోలాను రిలయన్స్ సంస్థ మళ్లీ మార్కెట్లోకి తీసుకుందని ఓ వార్త తెగ చక్కర్లు కొడుతుంది. అదే నిజమైతే, పెప్సీ, కోకాకోలాకు బిగ్‌షాక్ తగిలినట్లైనని నిపుణులు పేర్కొంటున్నారు.

ది ఎకనామిక్ టైమ్స్ అనే ఆంగ్ల పత్రిక తెలిపిన వివరాల ప్రకారం..”రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి త్వరలో సాఫ్ట్ డ్రింక్స్ రాబోతుంది. తాజాగా ఆ కంపెనీ ఢిల్లీకి చెందిన ప్యూర్ డ్రింక్ గ్రూప్ నుంచి కాంపా, సోస్యో సాఫ్ట్ డ్రింక్స్ బ్రాండ్స్‌ను కొనుగోలు చేసింది. వీటిని రిలయన్స్ మళ్లీ రీలాంచ్ చేయనుంది. ఎస్ఎంసీజీ వ్యాపారంలోకి అడుగుపెడుతున్నామని, రిలయన్స్ నుంచి ప్రకటన వెలువడిన రెండ్రోజులకే ఈ కొనుగోలు జరిగింది. మార్కెట్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న పెప్సీ, కోకాకోలాకు పోటీగా ఈ కాంపా కోలాను తీసుకురానున్నట్లు తెలుస్తోంది. దీనికోసం రిలయన్స్..ఏకంగా రూ.22 కోట్ల పెట్టుబడి పెట్టింది” అని పేర్కొంది.

ఇప్పటికే రిలయన్స్‌లో.. హిందుస్థాన్ యూనిలీవర్, నెస్లే, బ్రిటానియా కంపెనీలు ఈ రంగంలో అగ్రగామిగా ఉన్నాయి. తాజాగా ఈ వ్యాపారంలోకి రిలయన్స్ సైతం అడుగుపెడుతుండటం హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఏడాది దీపావళికి కాంపా బ్రాండ్‌ను రీలాంచ్ చేయాలని రిలయన్స్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. రిలయన్స్ రిటైల్ స్టోర్లు, జియోమార్జ్, కిరాణా స్టోర్లలో వీటిని విక్రయానికి ఉంచనున్నట్లు తెలుస్తోంది.

1990ల్లో పార్లే తీసుకొచ్చిన థమ్స్అప్, గోల్డ్ స్పాట్, లిమ్కాతో సమానంగా ఈ కాంపా డ్రింక్ మార్కెట్లో ఓ వెలుగు వెలిగింది. ఎప్పుడైతే, కోకాకోలా, పార్లే ఆగ్రో బ్రాండ్లను కొనుగోలు చేసిందో, కాంపా అంతర్థానం మొదలైంది. ఆ తర్వాత పలుమార్లు మార్కెట్లోకి రీ ఎంట్రీకి ప్రయత్నించిన ఫలితం లేకుండాపోయింది. మళ్లీ ఈ పాపులర్ బ్రాండ్‌ను రిలయన్స్ కొనుగోలు చేయడం ద్వారా ఈ బ్రాండ్ రీ ఎంట్రీ ఇవ్వనుంది.