Big Twist in Secretariat employee Dharma Naik death in Medak Car Fire Accident Case
mictv telugu

సెక్రటేరియట్ ఉద్యోగి ధర్మానాయక్ హత్యకేసులో భారీ ట్విస్ట్

January 17, 2023

తెలంగాణ సెక్రటేరియట్ ఉద్యోగి.. ధర్మ నాయక్(48) హత్యకేసు విచారణలో పోలీసులకు దిమ్మతిరిగే నిజాలు తెలిశాయి. ధర్మ నాయక్ చనిపోలేదని తాజాగా పోలీసులు తేల్చారు. మెదక్ జిల్లాలో చనిపోయాడనుకున్న వ్యక్తి.. మహారాష్ట్రలోని పూణెలో బతికే ఉన్నట్లు నిర్థారించారు. 8 రోజుల కిందట ఈ నెల 9వ తేదీన పోలీసులకు మెదక్‌.. టేక్మాల్ మండలం.. వెంకటాపురం గ్రామ శివారులో తగలబడిన కారు, అందులో కాలిన శవం స్థానికులకు కనిపించింది. పోలీసులు వచ్చి దర్యాప్తు చేసి.. కారును బట్టీ.. ఆ వ్యక్తి ధర్మ నాయక్ అని గుర్తించారు. పోస్ట్ మార్టం తర్వాత మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. కుటుంబ సభ్యులు అంత్యక్రియలు కూడా పూర్తి చేశారు. అయితే అనూహ్యంగా అతడు బతికే ఉన్నట్లు పోలీసులు తేల్చారు. మంగళవారం ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.

సెక్రటేరియట్ ఉద్యోగి ధర్మానాయక్ ఆన్ లైన్ గేమింగ్, బెట్టింగ్ లో రూ. 2 కోట్లు అప్పులు చేశాడు. ధర్మాకు రెండుకోట్ల అప్పులు ఎలా తీర్చాలని భయం పట్టుకుంది. చివరికి చావు తెలివితేటలు ఉపయోగించి.. చనిపోయినట్లు నటిస్తే రూ. బీమా సొమ్ము రూ.7 కోట్లు వస్తుందని భావించాడు. ఈ నెల 5న హైదరాబాద్ నుంచి కుటుంబసభ్యులతో కలిసి ఉమ్మడి మెదక్ జిల్లాలోని స్వగ్రామానికి బయలుదేరాడు. కుటుంబ సభ్యులను ఇంటి వద్ద వదిలిపెట్టాడు. పనికి వెళుతున్నానని చెప్పి.. తిరిగి కారులో బయటకు వెళ్లాడు. సరిగ్గా మెదక్ జిల్లా టేక్మల్ వద్ద కారును ఆపి, లోపల డ్రైవర్ ఉండగానే బయటి నుంచి పెట్రోల్ పోసి నిప్పటించాడు. అనుకున్నట్లుగానే.. కారుతోపాటు కారులోని డ్రైవర్ కూడా సజీవ దహనం అయ్యాడు. ఈ ఘటనలో తానే చనిపోయినట్లుగా ధర్మా డ్రామా ప్లే చేశాడు. తద్వారా ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసే ప్రయత్నం చేశాడు.

కానీ, పోలీసులు తమ మార్క్ లెవల్ ఇంట్రాగేషన్‌తో ధర్మా డ్రామాలు బయటపడ్డాయి. దగ్ధమైన కారు సమీపంలోనే ఓ పెట్రోల్ బాటిల్ లభ్యమైంది. దాని ఆధారంగా కూపీ లాగితే అసలు మ్యాటర్ బయటపడింది. రూ. 7 ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ధర్మా ఈ డ్రామా ఆడినట్లు తేల్చారు. మూడు రోజుల క్రితం ధర్మానాయక్ తన భార్యకు ఫోన్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. డెత్ సర్టిఫికేట్ తీసుకుని ఇన్సూరెన్స్ కంపెనీకి సమర్పించాలని కోరినట్లు సమాచారం. ఈ సమాచారం ఆధారంగా పోలీసులు విచారణ జరిపితే ధర్మానాయక్ పూణేలో ఉన్నట్లు తేలింది. ధర్మానాయక్‌ను పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. కారులో లభ్యమైన మృతదేహానికి ధర్మానాయక్ కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు.

అయితే, ధర్మానాయక్‌ కారులో మృతదేహం ఎవరనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కారులో సజీవదహనం అయింది ఎవరు. చంపి కారులో పెట్టి దహనం చేశారా? బతికి ఉండగానే సజీవదహనం చేశారా? వివరాల కోసం ఆరా తీస్తున్నారు. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ధర్మానాయక్ చనిపోయినట్లు నటించిన డ్రామా కుటుంబ సభ్యులకు తెలుసా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కారు దగ్ధమైన ఘటన వెలుగులోకి వచ్చిన రోజున కారులో మృతదేహం ధర్మానాయక్‌దేనని చెప్పిన వారిని కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నారు.