సీక్రెట్‌గా రెండో పెళ్లి చేసుకున్న సామ్రాట్  - MicTv.in - Telugu News
mictv telugu

సీక్రెట్‌గా రెండో పెళ్లి చేసుకున్న సామ్రాట్ 

November 5, 2020

Samtrat

తెలుగు బిగ్‌బాస్ సీజన్ 2తో తెలియని వారికి కూడా తెలిసిపోయిన నటుడు సామ్రాట్ చెప్పాపెట్టకుండా రెండో పెళ్లి చేసుకున్నాడు. కొద్దిమంది బంధుమిత్రుల సమక్షంలో తాళి కట్టేశాడు. అంజనా శ్రీ లిఖిత అనే యువతిని అతడు పెళ్లి చేసుకున్నాడు. కరోనా వైరస్ వల్ల ఎక్కువ మందిని పిలవకుండా తంతు ముగించాడు. బిగ్‌బాస్‌లో తనతోపాటు పాల్గొన్న తనీష్‌, దీప్తి సునాయన పెళ్లికి హాజరయ్యారు. సామ్రాట్‌ సోదరి, ఫిట్‌నెస్‌ ఎక్స్‌పర్ట్‌ శిల్పా రెడ్డి  పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టింది. 

సామ్రాట్‌కు గతంలో హర్షితా రెడ్డితో పెళ్లి జరిగింది. కట్నం కోసం వేధిస్తున్నాడంటూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అత్తింటోళ్లు తనపై హత్యాయత్నం కూడా చేస్తున్నారని ఆరోపించింది. తర్వాత విడాకులు తీసుకుంది. వైఫ్‌ ఆఫ్‌ రామ్‌, పంచాక్షరి వంటి సినిమాల్లో నటించి సామ్రాట్‌ ఎందుకో సినిమాల్లో నిలదొక్కుకోలేక పోతున్నాడు.