సంజన ఫిర్యాదు.. నందీశ్వర్ గౌడ్ కొడుకు సస్పెండ్  - MicTv.in - Telugu News
mictv telugu

సంజన ఫిర్యాదు.. నందీశ్వర్ గౌడ్ కొడుకు సస్పెండ్ 

December 2, 2019

Bigboss sanjana ..

నటి, బిగ్‌బాస్ ఫేమ్ సంజన ఫిర్యాదు కలకలం రేపింది. పటాన్ చెరువు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ కొడుకు ఆశిష్ గౌడ్ తనపై దాడి చేసి, అసభ్యంగా ప్రవర్తించాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడం తెలిసిందే. దీంతో నష్ట నివారణ కోసం బీజేపీ ఆశిష్ ‌గౌడ్‌ను నుంచి పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. తాము మహిళల సంక్షేమం, రక్షణకు కట్టుబడి ఉంటామని, మహిళలపై ఎలాంటి దాడులనూ సహించబోమని పార్టీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మాచన్నగారి నరేందర్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.

నోవాటెల్ హోటల్లో శనివారం ఆశిష్ తనపై మద్యం బాటిళ్లతో దాడి చేసినట్లు సంజన ఆరోపించింది. అంతేకాకుండా, అతడు తనను భవనంపైనుంచి కిందికి తోయడానికి యత్నించాడని తెలిపింది. తాను భయపడిపోయి, అక్కడి నుంచి తప్పించుకుని వచ్చానని చెప్పింది. దీంతో పోలీసులు అశీష్‌పై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు.