బిగ్ బాస్ షో పై మహేష్ కత్తి పుస్తకం ! - MicTv.in - Telugu News
mictv telugu

బిగ్ బాస్ షో పై మహేష్ కత్తి పుస్తకం !

August 12, 2017

బిగ్ బాస్ షో నుండి ఎలిమినేట్ అయిన మహేష్ కత్తి మీద జూనియర్ ఎన్ టీఆర్ తనదైన శైలిలో సెటైర్లు వేసాడు. తను ఈ షో నుండి బయటకు వెళ్ళగానే బిగ్ బాస్ షో మీద పుస్తకం రాస్తానని చెప్పడం ఇంట్రెస్టును క్రియేట్ చేసింది. హౌజ్ లో తను గడిపిన రోజుల్లోని ఎక్స్ పీరియన్స్ మీద పుస్తకం రాస్తానని ప్రకటించాడు. మనిషి తనను తాను గెలవడమే బిగ్ బాస్ లక్ష్యం అని ఎన్ టీఆర్ అన్న మాటకు అవును నన్ను నేను తెల్సుకున్నాను.

ఇన్ని రోజులు షోలో వుండి చాలా నేర్చుకున్నాను అని హ్యాప్పీగా సమాధానం చెప్పాడు. ఇన్ని రోజులు అందరితో కలిసి వుండి అందరితో మంచి ఎఫెక్షన్ ఏర్పడింది. సడన్ గా వాళ్ళని వదిలి వెళ్ళడం చిన్నగిల్టీగా వుందని కూడా చెప్పాడు మహేష్. అయితే మహేష్ కత్తి చివరివరకు హౌజ్ లో వుంటాడని బిగ్ బాస్ ఫ్యాన్స్ అనుకున్నారు. కానీ ఎలిమినేట్ వేటు మహేష్ కత్తి మీద పడక తప్పలేదు. ఎన్ టీఆర్ మహేష్ కత్తితో చాలా జోవియల్ గా మాట్లాడారు. బాస్ హౌజ్ లో మహేష్ కత్తికి అత్యంత ఇష్టమైనది బీన్ బ్యాగ్ అని అని దాని మీద కూర్చుండబెట్టి మాట్లాడారు.

అలాదే తనకు హౌజ్ లో గెలిచేవారు ఎవరని అడిగిన ప్రశ్నకు ప్రిన్స్ అని చెప్పాడు. రెండు వైపులా గేమ్ ఆడుతున్నదెవరని అడిగినప్పుడు ఠక్కున ధన్ రాజ్ పేరు చెప్పాడు. అలాగే ఆదర్శ పర్ ఫార్మన్స్ బాగాలేదని కూడా చెప్పాడు. అలాగే కత్తి కార్తీకకు అందరికీ చెల్లెలిగా బాగానే వున్నావ్ కానీ టాస్ ఆడటంలో కూడా కాస్త షార్ప్ గా వుండమని సలహా ఇచ్చాడు కత్తి మహేష్. దీక్ష మీదైతే సెటైర్ ఘాటుగానే వేసాడు. దీక్ష తెలివిదే గానీ అమాయకురాలిగా వుండాలనుకుంటోందని చెప్పాడు. మొత్తానికి బిగ్ బాస్ షో మీద పుస్తకం రాస్తానంటున్న మహేష్ కత్తికి ఆల్ ది బెస్ట్ చెబుదామా !