bigboss telugu-6 midweek elimination...sri satya eliminated
mictv telugu

శ్రీసత్య అవుట్….బిగ్ బాస్ -6 మిడ్ వీక్ ఎలిమినేషన్

December 17, 2022

srisatya

బిగ్ బాస్ 6 లో అనుకున్నట్టుగానే మిడ్ వీక్ ఎలిమినేషన్ జరిగింది. హౌస్‌లోని ఆరుగురు ఫైనలిస్ట్‌లో ఒకరు మిడ్ వీక్‌లోనే ఎలిమినేట్ అవుతారని లాస్ట్ వీక్ నాగార్జున చెప్పాడు. అలాగే ఈరోజు సత్య ఎలిమినేట్ అయ్యింది.నిజానికి హౌస్ లో అందరూ కీర్తి వెళ్ళిపోవాలని కోరుకున్నారు.కానీ ప్రేక్షకులు మాత్రం శ్రీసత్యని ఎలిమినేట్ చేసినట్లు బిగ్‌బాస్ స్పష్టం చేశాడు. ఇక హౌస్‌లో ఐదుగురే మిగలగా.. ఆదివారం విజేత ఎవరో తేలనుంది.ఆ నిర్ణయాన్ని ప్రకటించే ముందు హౌస్‌లోని ఆరుగురు ఫైనలిస్ట్‌లని ఎవరు హౌస్ నుంచి వెలుపలికి వెళ్ళిపోవాలో పేరు చెప్పమన్నాడు. దాంతో చాలా మంది కీర్తి పేరు చెప్పారు. కానీ వాళ్ళకి బిగ్ బాస్ షాక్ ఇచ్చాడు. బయట అందరికీ శ్రీసత్య ఎలిమినేట్ అవుతుంది అని ఉప్పండిపోయినా….హౌస్ లో వాళ్ళకి మాత్రం ఇది షాకింగ్ విషయమే. కీర్తితో సహా దీన్ని ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేదు.

శుక్రవారం ఎపిసోడ్‌లో ప్రేక్షకులని ఓట్లు రిక్వెస్ట్ చేసుకునే అవకాశం ఇచ్చాడు బిగ్ బాస్. మొదట శ్రీహాన్, ఆ తర్వాత కీర్తికి ఛాన్స్ వచ్చింది. వాల్ ఆఫ్ ఫార్చూన్ టాస్క్‌లో ఈ ఇద్దరూ పోటీపడగా.. ఆదిరెడ్డి ఫుల్ సపోర్ట్ అందించడంతో శ్రీహాన్ నెగ్గి.. ఓట్లని రిక్వెస్ట్ చేసుకునే ఛాన్స్ కొట్టేశాడు. దాంతో మరోసారి ఆది రెడ్డిపై కీర్తి మండిపడింది.కానీ.. ఆ తర్వాత హెడ్ బాల్ టాస్క్‌లో రేవంత్‌ని ఓడించిన కీర్తి ఓట్లని రిక్వెస్ట్ చేసే ఛాన్స్ కొట్టేసింది. ఈ క్రమంలో ఓట్లు అడుగుతూనే ఒకవేళ తాను విన్నర్ అయితే ప్రైజ్ మనీ మొత్తం ఓ మంచి పనికే ఖర్చు చేస్తానని హామీ ఇచ్చింది.

ఇలా టాస్క్‌లు, ఓట్ల రిక్వెస్ట్‌లు అర్ధరాత్రి 12 గంటల వరకూ కొనసాగాయి. ఆ తర్వాత హౌస్‌మేట్స్ నిద్రపోయారు. ఎప్పుడూ లేని విధంగా ఉదయం 6 గంటలకే ఎమర్జెన్సీ సైరన్‌తో కూడిన కుక్కల సౌండ్‌తో కంటెస్టెంట్స్‌ని బిగ్‌బాస్ లేపాడు. అంత ఉదయాన్నే నిద్రలేవడానికి ఆపసోపాలు పడుతుంటే… హౌస్‌మెట్స్, ఈరోజు మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంది.. అందరూ రెడీ అవ్వాలి అంటూ ఊదరగొట్టాడు. అంతేకాదు.. వెంటనే మీ బ్యాగ్‌ని ప్యాక్ చేసుకోండి అని బిగ్‌బాస్ ఆదేశించాడు. దాంతో హౌస్‌మెట్స్ అందరూ లగేజీని సర్దుకున్నారు.

తర్వాత బిగ్ బాస్ ఒక్కొక్కరిని..మీ అభిప్రాయంలో టాప్-5 నుంచి ఎవరు ఇంటికి వెళ్లాలని భావిస్తున్నారో.. వారిని ఎగ్జిట్ ఫ్రేమ్‌ కింద నిల్చోబెట్టి తగిన కారణం చెప్పాలని బిగ్‌బాస్ అడిగాడు. భయం భయంగానే హౌస్‌మెట్స్‌ ఒకరి పేరు చెప్తూ వచ్చారు. శ్రీహాన్ – రోహిత్‌ని ఎగ్జిట్ ఫ్రేమ్‌ కింద నిలబెట్టాడు. ఆ తర్వాత కీర్తి – ఆది రెడ్డి ,శ్రీసత్య – కీర్తి, రోహిత్ – శ్రీహాన్,రేవంత్ – కీర్తి, ఆదిరెడ్డి – కీర్తి ని నిలబెట్టి కారణాలు చెప్పారు. ఎక్కువ మంది కీర్తినే ఎన్నుకొన్నారు.
కానీ బిగ్‌బాస్ మాత్రం.. శ్రీసత్య హౌస్ నుంచి వెళ్ళిపోవాలని ప్రేక్షకులు కోరుకున్నారు అంటూ ప్రకటించాడు. దాంతో రేవంత్ ఎమోషనల్ అయిపోయాడు. నా కోపాన్ని అర్థం చేసుకున్న ఫస్ట్ అమ్మాయి శ్రీసత్య అంటూ హగ్ చేసుకున్నాడు. అంతేకాదు ఫస్ట్ వీక్ నుంచి మేము ముగ్గరం కలిసి ఉన్నాం అంటూ శ్రీహాన్, శ్రీసత్య, రేవంత్ హగ్ చేసుకుని ఎమోషనల్ అయిపోయారు. అయితే శ్రీసత్య అందరిలాగే హంగామాల ముందు, నాగార్జున బైబైలతో కాకుండా కామ్ గా, ఒంటరిగా ఇంటి నుంచి వెళ్ళిపోయింది. ఎలాగో రెండు రోజుల్లో ఫైనల్ ఉంది కాబట్టి శ్రీసత్యను బిగ్ బాస్ మళ్ళీ పిలుస్తాడు కాబట్టి దీని కోసం ప్రత్యేకంగా ఏమీ ప్లాన్ చేయలేదు.

అంతా అయిపోయింది శ్రీసత్య వెళ్ళిపోయింది. తను అలా హౌస్ బయటకు వెళ్ళిందో లేదో, శ్రీహాన్ తన గేమ్ మొదలెట్టేసాడు. లాస్ట్ రెండు రోజులకు ఎందుకు అని అయినా ఆలోచించలేదు. సిరి ఉన్నప్పటి నుంచి బిగ్ బాస్ ను అబ్జర్వ్ చేస్తున్నాడు కదా…ఆ ఓవర్ ఆక్షన్ ఫుల్ గా చూపించేస్తున్నాడు. శ్రీసత్య వెళ్ళిన వెంటనే కీర్తి దగ్గరికి వెళ్ళి… నేను చెప్పానా నువ్వు ఉంటావు అని సోప్ వేయడం మొదలుపెట్టాడు. అవతలి వాళ్ళు ఏమనుకుంటారు అని కొంచెం కూడా ఆలోచించకుండా.ఏది ఏమైనా ఇంకో రెండు రోజుల్లో బిగ్ బాస్ ఫైనల్ విజేత ఎవరో తెలిసిపోతుంది. అందరూ అనుకుంటున్నట్టు రేవంత్ వస్తాడా లేక సర్ ప్రైజ్ లు ఇస్తూ మరెవరినైనా బిగ్ బాస్, ప్రేక్షకులు విజేతగా ప్రకటిస్తారా అనేది వేచి చూడాల్సిందే.