విజేత కౌశలే.. 45 శాతం ఓట్లు.. ప్రకటన లాంఛనమే.. - MicTv.in - Telugu News
mictv telugu

విజేత కౌశలే.. 45 శాతం ఓట్లు.. ప్రకటన లాంఛనమే..

September 29, 2018

తెలుగు బిగ్ బాస్2 రియాలిటీ షో విజేత ఎవరన్నదానిపై మీడియాతోపాటు సామాన్య జనం వేస్తున్న అంచనాలే నిజం కానున్నాయా? ఏక్ నిరంజన్, ఐ డోన్ట్ కేర్ అంటున్న కౌశలే టైటిల్ గెలుచుకోనున్నాడా? ఆదివారం ముగిసే షోలో అతని విజయ ప్రకటన కేవలం లాంఛనమేనా? అవుననే అంటున్నాయి బిగ్ బాస్ లోపలి, బయటి వర్గాలు.

rr

మొత్తం ఓట్లు 27 కోట్లు

కౌశల్ ఒంటరిపోరు జనానికి నచ్చిందని, ఇతర పోటీదార్లు చేస్తున్న దాడి కొన్నాళ్లుగా అతనికి సానుభూతి తెస్తోందని, ఫలితంగా అతనికి భారీగా ఓట్లు పడ్డాయని చెబుతున్నారు. గ్రాండ్ ఫినాలే మొదలైన తొలి రోజుల్లో అతనికి ఏకంగా 50 శాతానికి పైగా ఓట్లు వచ్చాయని, ప్రస్తుతం 45 శాతం ఓట్లుతో అందరికంటే ముందంజలో ఉన్నాడని తెలుస్తోంది. అందరు కంటెస్టంట్లకు కలిపి 27 కోట్ల ఓట్లు వచ్చాయని, ఇతర భాషల్లోని షోలతో పోల్చుకుంటే తెలుగు బిగ్‌బాస్‌కు పోలైన ఓట్లే అత్యధికమని నిర్వాహకులు చెబుతున్నారు.

కౌశల్ తర్వాతి స్థానం కోసం గీతామాధురి, దీప్తిల మధ్య గట్టి పోటీ ఉంది. వీరి ఓట్లు కాస్త అటూ ఇటూగా ఉన్నాయని అంటున్నారు. అయితే మూడు, నాలుగు స్థానాలు ఎవరివన్నదానిపై స్పష్టత వచ్చిందని, తనీశ్, సామ్రాట్‌లకు ఇవి దక్కుతాయని అంటున్నారు. బిగ్‌బాస్ షోలో పాల్గొన్న నూతన్ నాయుడుతోపాటు పలువురు కూడా విజేత కౌశలే అని బహిరంగం ప్రకటనలు చేస్తుండడం తెలిసిందే. బిగ్‌బాగ్ నిర్వాహకుల నుంచి వీరికి లీకులు అందివుంటాయని, కౌశల్ ముందంజలో ఉండడంతో వారు కూడా దాపరికం లేకుండా విజేత ఎవరో చెప్పేస్తున్నారని అంటున్నారు.