సల్మాన్ రెమ్యూనరేషన్ రూ.200 కోట్లు! - MicTv.in - Telugu News
mictv telugu

సల్మాన్ రెమ్యూనరేషన్ రూ.200 కోట్లు!

November 30, 2019

హిందీ రియాలిటీ షో బిగ్‌బాస్ ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ కార్యక్రమానికి బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ప్రత్యేక ఆకర్షణ. సీజన్ 1 నుంచి తాజాగా ప్రసారం అవుతున్న 13వ సీజన్ వరకు సల్మానే వ్యాఖ్యాతగా వ్యవహరించడం విశేషం. ఇప్పటివరకు వచ్చిన సీజన్లన్నీ నానా వివాదాలతో మంచి టీఆర్‌పీ రేటును పొందాయి. ఈ షో ఎంతపెద్ద హిట్టో దానికి సల్మాన్ ఖాన్ తీసుకుంటున్న పారితోషకం కూడా ఆ రేంజులోనే ఉంది. ఈ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నందుకుగాను సల్మాన్ రూ.200 కోట్లు పారితోషికం తీసుకుంటున్నారని బాలీవుడ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.  

Salman Khan.

తాజా సమాచారం ప్రకారం..  సల్మాన్ పారితోషికం ప్రతి సీజన్‌కు పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న సీజన్‌కు గాను అతడు వారానికి రూ.13 కోట్లు (ఎపిసోడ్‌కు రూ.6.5కోట్లు) పారితోషికం ఇస్తున్నారు. అయితే ఇటీవల ఆ షోను మరో ఐదు వారాలపాటు పొడిగించనున్నట్లు ప్రకటించారు. దీంతో ఆయనకు ఎపిసోడ్‌కు రూ.2 కోట్ల చొప్పున పారితోషకాన్ని పెంచారట. సల్మాన్ బిగ్‌బాస్ సీజన్‌లో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నందుకు రూ.200 కోట్లను పారితోషికంగా తీసుకుంటున్నారని తెలుస్తోంది.