హిందీ బిగ్‌బాస్‌ టైటిల్‌ విజేత అతడే - MicTv.in - Telugu News
mictv telugu

హిందీ బిగ్‌బాస్‌ టైటిల్‌ విజేత అతడే

February 16, 2020

xcfbx fc

హిందీ బిగ్‌బాస్‌ సీజన్ 13 ఎంతో ఘనంగా ముగిసింది. దీనికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సల్మాన్‌ ఖాన్‌ ఎంతో సందడి చేశాడు. అంతా ఊహించినట్టుగానే సిద్ధార్థ్‌ శుక్లా బిగ్‌బాస్‌ ట్రోఫీని గెలుచుకున్నాడు. దీంతో పాటు రూ.40 లక్షల ప్రైజ్‌మనీ, లగ్జరీ కారును సొంతం చేసుకున్నాడు. అసిమ్‌ రన్నరప్‌గా నిలిచాడు. ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ఈ షోలో కామెడీ కింగ్‌ సునీల్‌ గ్రోవర్‌, భారత క్రికెటర్లు హర్భజన్‌ సింగ్‌, మహ్మద్‌ కైఫ్‌ ఎంట్రీ ఇచ్చి సందడి చేశారు.

ఆరుగురు కంటెస్టెంట్లు ఆర్తి సింగ్‌, రష్మీ దేశాయ్‌, షెహనాజ్‌ గిల్‌, పారాస్‌, సిద్ధార్థ్‌ శుక్లా, అసిమ్‌లు ఫైనల్‌కు చేరుకున్నారు. వీరికి సల్మాన్‌ బంఫర్‌ ఆఫర్‌ ప్రకటించాడు. తాము గెలుస్తామన్న నమ్మకం లేని వారు రూ.10 లక్షలు తీసుకొని షో నుంచి వెళ్లిపోవచ్చని సూచించాడు. దీంతో పరాస్‌ మొదట వీడ్కోలు పలికాడు. ఆ తర్వాత ఆర్తి సింగ్‌, రష్మీ దేశాయ్‌, షెహనాజ్‌ గిల్‌ ఒక్కొక్కరుగా ఎలిమినేట్‌ అయ్యారు. చిట్టచివరగా అసిమ్‌, సిద్ధార్థ్‌ ఫైనల్‌ ట్రోఫీ కోసం పోటీ పడ్డారు. ఇద్దరు ఫైనలిస్టులను స్టేజీపైకి ఆహ్వానించిన సల్మాన్‌.. సిద్ధార్థ్‌ గెలిచాడంటూ అతని చేయి పైకెత్తి విజయాన్ని ప్రకటించాడు. తిరిగి ఏడు నెలల్లోనే బిగ్‌బాస్‌ 14తో మళ్లీ వస్తానంటూ సల్మాన్ ఖాన్ వీడ్కోలు తీసుకున్నాడు.