బాలయ్య పాటకు గంగవ్వ డ్యాన్స్.. బిగ్‌బాస్ హౌజ్‌లో రచ్చ రచ్చ - MicTv.in - Telugu News
mictv telugu

బాలయ్య పాటకు గంగవ్వ డ్యాన్స్.. బిగ్‌బాస్ హౌజ్‌లో రచ్చ రచ్చ

September 21, 2020

bcfbh

తెలుగు బిగ్‌బాస్‌4 సీజన్‌లో ఈ ఆదివారం సందడిగా జరిగింది. నిన్నటి వరకు హౌజ్ నుంచి వెళ్లిపోతానంటూ చెప్పిన కంటెస్టెంట్ గంగవ్వ ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. ఒక్కసారిగా ఫుల్ జోష్‌తో ఊగిపోతూ బాలయ్య పాటకు స్టెప్పులేసింది. ‘పైసా వసూల్’ సినిమా పాటకు ఆమె చేసిన డ్యాన్స్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. నాలుక మడతపెట్టి వేసిన స్టెప్పులు అందరిని ఆకట్టుకుంది. గంగవ్వలో వచ్చిన జోష్ చూసి బిగ్ బాస్ కూడా ఫుల్ హ్యాపీ అయిపోయారు. 

ఈ వారం గేమింగ్‌లో భాగంగా నాగార్జున ‘డాగ్‌ అండ్‌ బోన్‌’ ఆటను ఆడించాడు. అందులో కుమార్ సాయితో కలిసి గంగవ్వ పోటీపడింది. రింగ్ చుట్టూ తిరిగే క్రమంలో బాలయ్య పైసా వసూల్ సినిమాలోని టైటిల్ సాంగ్‌ పెట్టగా.. ఆమె డ్యాన్స్ చేస్తూ రింగ్‌లో ఉన్న బోన్ అందుకొని కుమార్ సాయిని ఆటపట్టించింది. బాలయ్య పాటకు దుమ్మురేపడం చూసి గంగవ్వ ఆర్మీ ఖుషీ అయిపోయింది. ఇటీవల కొంచెం భయం భయంగా కనిపించిన ఆమెలో వచ్చిన ఈ మార్పు చూసి ప్రేక్షకులు కూడా ఆశ్చర్యపోయారు. మొత్తానికి ఈ వారం గంగవ్వ హౌజ్‌లో ఫుల్ జోష్ నింపిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.