బిగ్‌బాస్ ‘షో’పై దేవి నాగవల్లి సంచలన ఆరోపణలు - MicTv.in - Telugu News
mictv telugu

బిగ్‌బాస్ ‘షో’పై దేవి నాగవల్లి సంచలన ఆరోపణలు

September 29, 2020

Bigg Boss 4 Telugu Devi Nagavalli’s Elimination In Third Week Shocks Many; See Reactions.

తాను బిగ్‌బాస్ ఇంట్లోంచి బయటకు రావడాన్ని అస్సలు నమ్మలేకపోతున్నానని.. తాను స్ట్రాంగ్ కంటెస్టెంట్‌నని ఓట్లతో ఆస్కారం లేకుండా ఇంట్లోనే ఉంటానని దేవీ నాగవల్లి చెప్పారు. మూడు సీజన్లకు పురుషులే బిగ్‌బాస్ టైటిల్ గెలిచారు.. ఈసారి మహిళే గెలవాలి అని, అది తనే కావాలనే తపనతో దేవి ఆ ఇంట్లోకి అడుగుపెట్టారు. ఈ నేపథ్యంలో అనూహ్యంగా బిగ్‌బాస్ సీజన్ 4 మూడవ వారంలో దేవి నాగవల్లి ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. ఇంట్లో ఎంత స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయినా, టాస్కుల్లో మంచి పర్‌ఫార్మెన్స్ ప్రదర్శించినా వారు ఇంట్లో ఉండాలా వద్దా అనేది డిసైడ్ చేసేది ప్రేక్షకుల ఓట్లే. కొంతమంది ముందుచూపుగా బయట ఓట్ల కోసం అన్నీ ఏర్పాట్లు చేసుకుని షోలో పాల్గొంటున్నారు. మరికొందరు గుడ్డిగా వెళ్లిపోతున్నారు. టీవీ9 జర్నలిస్ట్ అయిన దేవి కూడా తాను స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనే నమ్మకంతో వెళ్లారు. కానీ, ఓట్లు ఆమెకు పడకపోవడంతో ఎలిమినేట్ అయ్యారు. అయితే తన ఎలిమినేషన్ గురించి దేవి సంచలన వ్యాఖ్యలు చేశారు. తను అసలు ఎలిమినేట్ కావడం నాటకం అని.. అదంతా అబద్ధమే అని వ్యాఖ్యానించారు. 

ప్లాన్ ప్రకారమే తనను ఇంట్లోంచి బయటకు పంపారని ఆరోపణలు చేశారు. మరోవైపు బిగ్‌బాస్ మేనేజ్‌మెంట్‌పై కూడా ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ముందు బిగ్‌బాస్ అన్నపుడు తనకు కూడా మంచి అభిప్రాయమే ఉండేదని.. అక్కడికి వెళ్లిన తర్వాత కూడా అదే కంటిన్యూ అయిందని అన్నారు. అయితే ఎలిమినేషన్ అప్పుడు మాత్రం షాక్‌లో ఉండిపోయానని.. అసలు అలా ఎలా జరిగింది అంటూ ఆశ్చర్యపోయానంటూ చెప్పారు.
అప్పుడు ఓట్లు తక్కువ వచ్చాయంటే ఏమో అనుకున్నాగానీ.. ఇఫ్పుడు మాత్రం బయటికి వచ్చాక చూస్తుంటే ఏదో గందరగోళం జరిగిందనే విషయం స్పష్టమవుతుందని తెలిపారు.  బయటికి వచ్చిన తర్వాత చాలా మంది అభిమానులు ఫోన్ చేస్తున్నారని.. మెసేజ్ పెడుతున్నారని అన్నారు. ‘మీరు ఎలిమినేట్ అయిపోవడం ఏంటి దేవి గారూ’ అంటూ అడుగుతున్నారని వివరించారు. ‘బిగ్‌బాస్‌లో అంతా స్క్రిప్ట్ నడుస్తుందని ముందు నేను కూడా అనుకున్నాను. కానీ అక్కడ అలాంటివేం లేనట్లే అనిపించింది.  అయితే మిగిలిన వాళ్లు అలా స్క్రిప్ట్ రాసుకొచ్చారో.. వాళ్లకు ఇచ్చారో తెలియదు కానీ నేను ఉంటే మాత్రం స్క్రిప్ట్ బ్రేక్ అవుతుందని అనుకున్నారంటే అది నా నిజాయితీ. నేను ఉంటే షో రూపురేఖలు మారిపోతాయనుకుని నన్ను కావాలనే ఎలిమినేట్ చేశారేమో. ఒకవేళ నన్ను మళ్ళీ బిగ్‌బాస్ హౌజ్‌కు రావాలని పిలుపు వస్తే కచ్చితంగా వెళ్తాను. కానీ కోవిడ్ కారణంగా అలాంటిదేం ఉండకపోవచ్చు’ అని దేవి ఆరోపించారు.