Bigg Boss 6 Telugu Contestant Neha Chowdary Marriage Photos Gone Viral
mictv telugu

బిగ్ బాస్ ఫినాలే నుంచి నేరుగా కళ్యాణ మండపానికి..

December 20, 2022

 

తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ 6 ముగిసింది. రేవంత్ విజేతగా నిలిచాడు. ఇది తెలిసిందే కదా! ఇందులో కంటెస్టెంట్ గా ఉన్న నేహా చౌదరి పెండ్లి చేసుకుంది. అయితే.. బిగ్ బాస్ ఫినాలే నుంచి డైరెక్ట్ పెండ్లి మండపానికి చేరుకోవడం ఇక్కడ విశేషం.

21 కంటెస్టెంట్ లతో బిగ్ బాస్ సీజన్ 6 మూడు నెలలకు ముందు మొదలైంది. ఆ సమయంలో చాలామంది తెలిసి ఉండకపోవచ్చు. కానీ ఇప్పుడు అందరూ సుపరిచితులయ్యారు. నేహా చౌదరి స్ట్పోర్ట్స్ యాంకర్. రిథమిక్ జిమ్నాస్టిక్ లో నేషనల్ లెవల్ లో గోల్డ్ మెడల్ కొట్టింది. నేహాకనే కాదు.. ఇందులో ఉన్న ఒక్కొక్కరికీ ఒక్కో అనుభవాన్ని మిగిల్చింది బిగ్ బాస్. ఇందులో ఉన్న నేహా చౌదరికి లైఫ్ టైమ్ గుర్తుండిపోయేలా ఈ బిగ్ బాస్ ఉంటుంది. ఎందుకంటే ఆమె పెళ్లి రోజు.. బిగ్ బాస్ ఫైనల్ గంటల వ్యవధిలో జరిగింది. పెళ్లి కూతుర్ని చేసిన తర్వాత నేహా చౌదరి నేరుగా బిగ్ బాస్ ఫినాలేలోకి అడుగు పెట్టింది. అన్ని భాషల్లో జరిగిన ఏ బిగ్ బాస్ కంటెస్టెంట్లకి అసలు ఇలా జరిగి ఉండకపోవచ్చు.

తెలుగు బిగ్ బాస్ కంటెస్టెంట్ నేహా చౌదరి తను ఎలిమినేట్ అయ్యాక ఇంట్లో వాళ్లు పెళ్లి చేసుకోమని అనడంతో తన క్లాస్ మేట్ అనిల్ ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకొన్నది. గత నెలలో ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. ఆదివారం రాత్రి పది గంటలకు పెళ్లి ముహూర్తం. దీంతో ఫినాలే ముగియగానే నేరుగా ఆమె పెళ్లి పీటలెక్కింది. అంతేకాదు.. ఇతర కంటెస్టెంట్స్ కూడా ఆమెతో పాటు పెళ్లి మండపానికి చేరి సందడి చేశారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఇప్పుడు వారి ఫొటో నెట్టింట వైరల్ అవుతున్నది.
105రోజుల సాగిన తెలుగు బిగ్ బాస్ విన్నర్, రన్నర్ చర్చ ముగిసింది. ఇప్పుడు అందరూ నేహా చౌదరి పెళ్లి గురించే మాట్లాడుకుంటున్నారు. మొత్తానికి ఆమె ముందుగా చెప్పినట్టు బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుంటానని చెప్పినట్లుగానే చేసింది నేహా. పెండ్లి సందర్భంగా ఇప్పుడందరూ ఆమెకు అభినందనలు తెలియచేస్తున్నారు.

ఇవి కూడా చదవండి :

ఆర్ఆర్ఆర్ కి షాక్.. బుక్ మై షో బెస్ట్ ఇండియన్ మూవీస్

ఆరోగ్యం క్షీణిస్తోంది.. ఇక నా వల్ల కాదు.. సమంత సంచలన ప్రకటన

తను లేకపోతే బన్నీ లేడు..!