bigg boss 6 telugu winner will get costly land gift
mictv telugu

కానుకగా కాస్లీ ల్యాండ్.. బిగ్ బాస్ విజేతకు బంపర్ ఆఫర్

December 5, 2022

బిగ్ బాస్ సీజన్ 6 ముగింపు దశకు చేరుకుంది. మొదట్లో వచ్చిన నెగిటివిటీని అధిగమించి బిగ్ బాస్ రేటింగ్స్ కాస్త పుంజుకున్నాయి కూడా. ఫెవరెట్ కంటెస్టెంట్స్ కోసం ఓట్లు పెద్ద ఎత్తున పడుతున్నాయి. దీంతో తక్కువ వచ్చిన కంటెస్టెంట్స్ ఇంటిదారి పడుతున్నారు.
ఈ సీజన్లో ఇంకా రెండు వారాలే మిగిలి ఉండగా.. 13వ వారం జబర్దస్త్ ఫైమాని ఎలిమినేట్ చేసి బిగ్ బాస్ అందరికీ షాక్ ఇచ్చారు.
మొదట్లో రోహిత్ ఎలిమినేట్ అవ్వచ్చనుకుంటే.. భార్య హౌస్ నుండి వెళ్లిన తరువాత గేమ్ మరింత గట్టిగా ఆడటం స్టార్ట్ చేశాడు. దాంతో హౌస్ లో మిస్టర్ పర్ఫెక్ట్ బ్రాండ్ తో ఓటింగ్ ని అమాంతం పెంచుకున్నాడు రోహిత్. ఈ సందర్భంగా బిగ్ బాస్ 6 విజేత ఈ సారి ఎవరన్నదానిపై చర్చ నడుస్తుండగానే.. విన్నర్ కి బంపర్ ఆఫర్ ప్రకటించారు.

తాజాగా నాగార్జున బిగ్ బాస్ విన్నర్ అయిన వారికి ప్రైజ్ మనీ తో పాటు సువర్ణభూమి వారి ఇన్ఫ్రాడెవలపర్స్ కు చెందిన సాకేత్ వెంచర్స్ నుండి అత్యంత ఖరీదైన స్థలాన్ని అందివనున్నారని చెప్పుకొచ్చారు. బిగ్ బాస్ టైటిల్ విన్ అయ్యే వారికి సువర్ణభూమి ఇన్ఫ్రా డెవలపర్స్ వాళ్ళు ఒక అద్భుతమైన గిఫ్ట్ ఇస్తున్నారన్ననాగార్జున .. ఖరీదైన 605 స్క్వేర్ యార్డ్స్ గల ల్యాండ్ ఇవ్వనున్నట్టు చెప్పారు. అయితే ఈ భూమి విలువ దాదాపు 25 లక్షలు ఉంటుంది అని నాగార్జున ఇప్పటికే తెలిపారు. ఇక ఈ లెక్కన చూసుకుంటే విన్నర్ అయ్యే వారికి 50 లక్షలతో పాటు అదనంగా 25 లక్షల విలువ చేసే కాస్లీ ల్యాండ్ కూడా రాబోతుంది అంటూ బిగ్ బాస్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.