బిగ్ బాస్ 6 పెద్ద ఫ్లాప్ అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఎంత హైప్ చేసినా, జనాల్లోకి ఎంత తీసుకెళదామని ట్రై చేసినా కుదరలేదు. కంటెస్టెంట్ సెలక్షన్, ఎలిమినేషన్ అన్నీ చప్పచప్పగానే సాగాయి. టైటిల్ విన్నర్ ఎపిసోడ్ అయితే మరీ పేలవంగా సాగింది. బిగ్ బాస్ మ్యాజిక్కులు గిమ్మిక్కులు ఏవీ లాస్ట్ సీజన్ లో వర్కవుట్ కాలేదు. మరోవైపు హోస్ట్ గా నాగార్జున కూడా ఆకట్టుకోలేకపోయారు. హౌజ్ లోకి వచ్చిన స్ట్రాంగ్ ఇంకా బయట ఐడెంటిటీ ఉన్న వారిని ఒకలా మిగతా వారిని మరోలా ట్రీట్ చేశారన్న టాక్ వినిపించింది.
అంతేకాదు బిగ్ బాస్ హోస్ట్ గా నాగార్జున కూడా ఆడియన్స్ కి బోర్ కొట్టేశాడు. రొటీన్ టాస్కులు ఆసక్తిలేని ఆటలతో సీజన్ 6 అంతా అసంతృప్తిగానే అనిపించింది. అయితే సీజన్ 7 విషయంలో అలాంటి తప్పులు జరగకుండా చూడాలని ఫిక్స్ అయ్యారు. అందుకే కంటెస్టంట్స్ ఎంపిక నుంచి టాస్కుల వరకు అంతా పర్ఫెక్ట్ గా కొత్తగా ప్లాన్ చేస్తున్నారట.అందులో భాగంగానే సీజన్ 7 హోస్ట్ గా నాగార్జునని తప్పించి మరో కొత్త హోస్ట్ ని తీసుకొస్తున్నారని తెలుస్తుంది. బిగ్ బాస్ సీజన్ 3 నుంచి సీజన్ 6 వరకు మూడు సక్సెస్ ఫుల్ సీజన్ లతో పాటుగా బిగ్ బాస్ నాన్ స్టాప్ అంటూ ఓటీటీ బిగ్ బాస్ ని కూడా నాగార్జునే హోస్ట్ చేశారు. లాస్ట్ సీజన్ తప్ప మిగతా అన్నీ సీజన్లు నాగార్జున ఆకట్టుకున్నారు. కానీ 6 మాత్రం అస్సలు బాగా చేయలేదు. అంతేకాదు నాగార్జునకి కూడా బిగ్ బాస్ మీద ఇంట్రెస్ట్ పోయిందని అంటున్నారు. అందుకే బిగ్ బాస్ టీం హోస్ట్ ని మార్చుదాం అన్న వెంటనే నాగార్జున కూడా అందుకు ఎలాంటి అభ్యంతరం తెలుపలేదని సమాచారం.
ఇక అసలు విషయానికి వస్తే… బిగ్ బాస్ సీజన్ 7 హోస్ట్ గా ఎవరు చేస్తారు అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్న. సీజన్ 1 ఎన్.టి.ఆర్ హోస్ట్ గా చేయగా సీజన్ 2 నాని హోస్ట్ గా వ్యవహరించారు. మళ్ళీ సీజన్ 7 వీరిద్దరిలో ఒకరు హోస్ట్ గా చేస్తారా అంటే ఛాన్సే లేదని తెలుస్తుంది. బయటకు వస్తున్న సమాచారం ప్రకారం బిగ్ బాస్ సీజన్ 7 హోస్ట్ గా రానా రేసులో ఉన్నట్టు తెలుస్తుంది. రానా కాకపోతే మరో హీరో ఎవరన్నది మాత్రం ఆలోచన రావట్లేదు.
మధ్యలో బాలకృష్ణ పేరు కూడా వినిపించింది. అయితే తరువాత అదేమీ తెరకెక్కే ఆలోచనలా అనిపించలేదు. రానాకు ఓటీటీ షోలను హోస్ట్ చేసిన అనుభవం ఉంది కాబట్టి రానా అయితే పర్ఫెక్ట్ అంటున్నారు ఆడియన్స్. స్క్రీన్ కూడా ఫ్రెష్ లుక్ ఉంటుందని అభిప్రాయ్ం వ్యక్తం చేస్తున్నారు. మరి బిగ్ బాస్ సీజన్ 7 హోస్ట్ ఎవరన్నది తెలియాలంటే మాత్రం కొన్నాళ్ళు వేచి చూడాల్సిందే.