బిగ్ బాస్ సీజన్-6లో ఉన్న టాలీవుడ్ సింగర్ రేవంత్ తండ్రి అయ్యాడు. ఆయన భార్య అన్విత డిసెంబర్ 1న (గురువారం) పండంటి ఆడిబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా తెలిపింది. దీంతో రేవంత్ ఇంట్లో సంబరాలు నెలకొన్నాయి. అతడి అభిమానులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో విషెస్ చెబుతున్నారు. రేవంత్ బిగ్ హౌస్‌లోకి అడుగు పెట్టిన సమయానికే ఆమె నిండు గర్భిణీగా ఉంది. ఈ మధ్య సీమంతం జరిగిన వీడియోను కూడా రేవంత్‌కు చూపించడంతో కంటతడి పెట్టుకున్నాడు. తనకు చిన్పప్పటి నుంచి తండ్రి లేని లోటు తెలుసని, అందుకే ఎప్పుడెప్పుడు నాన్న అని పిలిపించుకుంటానా అని ఎదురు చూస్తున్నా అంటూ బిగ్ బాస్ హౌస్‌లో చెప్పి ఎమోషనల్ అయ్యారు. రానున్న ఎపిసోడ్లో బిగ్ బాస్ హౌస్‌లో రేవంత్‌కి ఈ గుడ్ న్యూస్ చెప్పేసమయంలో అతని ఆనందం కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.