కంటెస్టెంట్స్ కెరీర్స్ ని ఏం మార్పులు వస్తున్నాయో కానీ బిగ్ బాస్ షో పుణ్యమాని పెద్ద ఎత్తున కొత్త యూట్యూబ్ ఛానెల్స్ పుట్టుకొస్తున్నాయి. బిగ్ బాస్ నుండి బయటికి వచ్చాకా.. సినిమా ఆఫర్స్, ఈవెంట్స్ అంటూ చేతి నిండా సంపాదిస్తున్న స్టార్స్ అందరు సొంత యూట్యూబ్ ఛానల్స్ కూడా పెట్టుకుంటున్నారు. ఇక తమ ఛానల్ ప్రమోషన్స్ కోసం రకరకాల వీడియోలు చేసి జనాలపైకి వదిలేస్తున్నారు. వంట వీడియోలు, హౌస్ వీడియోలు, షాపింగ్ వీడియోలు చేస్తూ.. వ్యూస్, సబ్ స్క్రైబర్స్ కోసం బిగ్ బాస్ కంటెస్టెంట్ల పాట్లు అన్నీఇన్నీ కావు. ఇక తాజాగా బిగ్ బాస్ 5లో సందడి చేసిన ఇనయ.. ‘ఇనయ రెహమాన్’ పేరుతో సొంత ఛానల్ పెట్టి వరుసగా వీడియోలు వదులుతుంది. స్క్రిప్ట్ లో భాగమో లేక మనసులోని భావాలూ వ్యక్తీకరించిందో కానీ.. ఇనయ సోహెల్ కి ప్రపోజ్ చేసింది. సిగ్గులొలకపోస్తూ.. ఎరుపెక్కిన బుగ్గలతో రెడ్ డ్రెస్ లో రెడ్ రోజ్ ఇచ్చి మరి సోహెల్ కి తన ప్రేమని చెప్పేసింది.
‘ఒకటి చెప్పదలచుకున్నాను… మీరు ఏం అనుకున్నా పర్వాలేదు. నా మనసులో ఉన్నది నేను చెబుతా” అని రోజ్ ఫ్లవర్ బొకే తీసుకుని సోహైల్ ముందు మోకాళ్ళ మీద కూర్చుని మరీ ఇనయా ప్రపోజ్ చేశారు. ”ప్రేమ ఉన్నంత వరకూ కాదు… నా ప్రాణం ఉన్నంత వరకూ ప్రేమిస్తా” అనేసరికి సోహైల్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. తర్వాత రోజ్ ఫ్లవర్ బొకే నుంచి ఒక్క గులాబీ తీసి అతనికి ఇచ్చారు. ”నీ కోసం రెడీ అయ్యాను. మీకు ప్రపోజ్ చేయాలని ఇలా వచ్చా. నాకు నువ్వంటే పిచ్చి” అంటూ ఇనయ రెహమాన్ చెప్పుకొచ్చారు. అయితే బిగ్ బాస్ లో ఉన్నప్పటి నుండే తనకి సోహెల్ అంటే చాల ఇష్టమని చెప్పింది ఇనయ. ఇక షో సాగుతున్న మధ్యలో సోహెల్ కూడా ఇనయ కోసం ప్రచారం చేశాడు. ఇక బిగ్ బాస్ 5 కంటెస్టెంట్ సోహెల్ త్వరలో లక్కీ లక్ష్మణ్ చిత్రంతో టాలీవుడ్ తెరపై పరిచయం కానున్నాడు. ఇక ఇనయ లవ్ ప్రపోజల్ తో అటు లక్కీ లక్ష్మణ్ కి ఇటు ఇనయ యూట్యూబ్ ఛానెల్ కి మంచి ప్రమోషన్ దక్కినట్టయింది. మరో ఇనయ ప్రపోజల్ కి సోహెల్ రెస్పాన్స్ ఏంటన్నది తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి :
పవన్ – బాలయ్యల సెట్స్ లో సెక్యూరిటీ లోపం.. భారీ గందరగోళం ?
సల్మాన్ ఖాన్ పుట్టిన రోజు వేడుకల్లో షారూఖ్ ఖాన్ సందడి..వీడియో వైరల్
భగభగ మండే వాల్తేరు వీరయ్య.. టైటిల్ సాంగ్ వచ్చేసింది