‘బిగ్‌బాస్’ రవికృష్ణకు కరోనా.. స్వయంగా చెప్పిన నటుడు  - MicTv.in - Telugu News
mictv telugu

‘బిగ్‌బాస్’ రవికృష్ణకు కరోనా.. స్వయంగా చెప్పిన నటుడు 

July 4, 2020

v nvc nb

కరోనా వైరస్ సోకితే ఆ విషయాన్ని బయటకు చెబితే ఇతరులు వెక్కిరిస్తారనో.. అంటానివాళ్లను చేస్తారనో చాలామంది బయటకు చెప్పడం లేదు. ఇలాంటి సమయంలో ప్రముఖ టీవీ సీరియల్ నటుడు, బిగ్‌బాస్ సీజన్ 3 కంటెస్టెంట్ రవి తనకు కరోనా పాజిటివ్‌గా తేలిందని సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. తనకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయిందని చెప్పాడు. అయితే ఎలాంటి లక్షణాలు లేవని.. ప్రస్తుతం ఐసొలేషన్‌లో ఉన్నానని పేర్కొన్నాడు. తనకు కరోనా సోకిందని తాను ఆందోళన చెందడం లేదని తెలిపాడు. తనతో కాంటాక్ట్‌లోకి వచ్చిన వారంతా ఐసొలేషన్‌కు వెళ్లాలని, పరీక్షలు చేయించుకోవాలని విన్నవిస్తున్నానని అన్నాడు. 

కాగా, జీ తెలుగులో ప్రసారం అయ్యే ‘సూర్యకాంతం’ సీరియల్‌లో నటిస్తున్న ప్రభాకర్‌కు కరోనా సోకిన విషయం తెలిసిందే. దీంతో ఒక్కసారిగా బుల్లితెర లోకం ఉలిక్కి పడింది. తిరుపతి నుంచి హైదరాబాద్‌కి వచ్చిన సదరు నటుడికి సెట్స్‌లో జ్వరం కనిపించడంతో పరీక్ష చేయించారు. అతడికి కరోనా పాజిటివ్ అని తేలడంతో యూనిట్ సభ్యులంతా ఖంగు తిన్నారు. వెంటనే అందరినీ క్వారంటైన్‌కి పంపించారు. ఈ ఘటన గురించి మరిచిపోకముందే మరో టీవీ నటుడికి కరోనా సోకడం తీవ్ర కలకలం రేపింది. ‘గృహలక్ష్మి’ సీరియల్‌లో నటిస్తున్న హరికృష్ణ అనే నటుడికి కరోనా పాజిటివ్ అని తేలడంతో యూనిట్ షూటింగ్‌ను రద్దు చేసింది. వెంటనే హరికృష్ణతో కాంటాక్ట్ అయిన వాళ్లను పరీక్షలకు పంపించారు.  నాపేరు మీనాక్షి, ఆమె కథ సీరియళ్లలో నటిస్తున్న నవ్యస్వామికి కరోనా పాటిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆమె కూడా సోషల్ మీడియాలో తనకు కరోనా సోకినట్టు వెల్లడించింది. అలాగే ప్రముఖ నిర్మాత, కమెడియన్ బండ్ల గణేష్‌కు కరోనా సోకగా.. ఆయన దానిని జయించారు. తాను పూర్తిగా కోలుకున్నానని తెలియజేస్తూ సోషల్ మీడియాలో ఇటీవల ఆయన ఎమోషనల్ పోస్ట్‌ని షేర్ చేశారు. ఇదిలావుండగా ప్రముఖ నిర్మాత పోకూరి రామారావు (64) కరోనా వైరస్ కారణంగా చనిపోయారు. హైదరాబాద్‌లోని కాంటినెంటల్ ఆసుపత్రిలో శనివారం ఉదయం 9 గంటల సమయంలో మృతిచెందారు. ఈ సంఘటన అతని కుటుంబంతో పాటు సినీ పరిశ్రమను శోఖసంద్రంలో ముంచేసింది.