బిగ్ బాస్ షోపై సీపీఐ నారాయణ ఆసక్తిర కామెంట్స్ చేశారు. బిగ్ బాస్‌ను వెంటనే బ్యాన్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నారాయణ మీడియాతో మాట్లాడుతూ.. ”ఎందుకూ ఈ పనికిరాని షో. దీనివల్ల సమాజం నాశనమైపోతుంది. బిగ్ బాస్ షో ప్రసారాలను వెంటనే ఆపేయాలి. బిగ్ బాస్ షో అంటే ఇది ఒక వ్యభిచార గృహం. ఆ బిగ్ బాస్ హౌస్ లోపల జరిగేది అంత చీకటి వ్యవహారం” అని ఆయన మండిపడ్డారు.
మరోపక్క బిగ్ బాస్ నాన్- స్టాప్ గ్రాండ్ లాంఛ్‌కి సర్వం సిద్ధమయ్యింది. డిస్లీ హాట్ స్టార్‌లో శనివారం నుంచి ఈ షో ప్రసారం కానుంది. గ్రాండ్ లాంఛ్ కార్యక్రమం ప్రసారాలు శనివారం సాయంత్రం 6 గంటల నుంచి ప్రారంభంకానున్నాయి.
ఈ నేపథ్యంలో బిగ్‌బాస్.. బిగ్ న్యూసెన్స్ అంటూ నారాయణ గతంతో కూడా విమర్శలు చేశారు.కానీ ఈసారి తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. ఏకంగా.. బిగ్‌బాస్ హౌజ్‌ను బ్రోతల్ హౌజ్‌తో పోల్చేశారు.