ఇక్కడ కౌశల్ ఆర్మీ .. అక్కడ రుత్విక ఆర్మీ - MicTv.in - Telugu News
mictv telugu

ఇక్కడ కౌశల్ ఆర్మీ .. అక్కడ రుత్విక ఆర్మీ

October 1, 2018

తెలుగు బిగ్‌బాస్2 రియాలిటీ షో విజేత కౌశల్ బాటలో ఇతర భాష విజేతలు కూడా సాగినట్లు కనిపిస్తోంది. కౌశల్ గెలుపు కోసం బయట అతని ఆర్మీ పనిచేసినట్లే తమిళ వెర్షన్ విజేత రుత్విక గెలుపు కోసం ఆమె ఆర్మీ కూడా అష్టకష్టాలు పడింది. సక్రమంగా కొన్ని, అక్రమంగా మరికొన్ని ఓట్లేయించి, ర్యాలీలు తీసింది. ఆదివారం ముగిసిన ఫినాలేలో రుత్విక టైటిల్ గెల్చుకుని, 50 లక్షలు కైవశం చేసుకుంది.Bigg Boss Tamil 2 winner Riythvika: I want to be an inspiration Riythvika on Sunday became the winner of the second season of Bigg Boss Tamil. She took home a cash prize of Rs 50 lakh and a trophy.రుత్విక నిజానికి ఈ షో మొదటివారంలోనే ఎలిమినేట్ కాగా, నిర్వాహకులకు బతిమాలుకుని షోలో కొనసాగింది. కౌశల్ కూడా మొదటి వారం ఎలిమినేషన్ లిస్టులో ఉన్నాడు. రుత్విక కూడా మిగతా కంటెంస్టంట్లతో సరిగ్గా వ్యవహరించకుంగా ఒంటెత్తు పోకడకు పోయేది. కీచులాటకు దిగేది. ఇలాంటి చాలా ప్రతికూల అంశాలున్నా.. ఆమె అభిమానులు భారీ సంఖ్యలో ఓట్లేయించారు. తన విజయం యువతులకు ప్రేరణ కలిగిస్తుందని ఆమె చెప్పారు. కమల్ హాసన్ హోస్ట్‌గా వ్యవహరించి తమిళ్ బిగ్ బాస్ తెలుగు బిగ్ బాస్‌కు వివాదాలు, తిట్లు, డ్రామాల్లో సరిసమానంగా సాగింది.