సీజన్ ను టాప్ లో ఉంచడానికి ఇన్ని చేయాలా? బిగ్ బాస్ సీజన్ 6 ఫైనల్ చూసిన తర్వాత అందరికీ వచ్చిన డౌట్ ఇదే. అందరూ అనుకున్నట్టే రేవంత్ విన్నర్ అయ్యాడు. కానీ అసలు విన్నర్ మాత్రం శ్రీహాన్. పిల్లాడు నక్కతోక వచ్చాడులా ఉంది. రేవంత్ కన్నా ఎక్కువ డబ్బులు సంపాదించడమే కాదు సగం ధరకు సువర్ణభూమి ప్లాట్ కూడా పట్టుకెళ్ళిపోయాడు. టైటిల్ విన్నర్ రేవంత్ ఓన్లీ 10 లక్షలతో, ట్రోఫీతో సరిపెట్టుకున్నాడు. అన్నింటికన్నా మెయిన్ నాగార్జున చివర్లో ఇచ్చిన ట్విస్ట్. రేవంత్ కన్నా శ్రీహాన్ కే ఎక్కువ ఓట్లు వచ్చాయని, అతనే విన్నర్ అని నాగార్జున చివర్లో ఎనౌన్స్ చేయడంతో అక్కడున్నవారే కాదు టీవీల్లో చూస్తున్న చాలామంది షాక్ తిన్నారు. ఒకరకంగా రేవంత్ బిగ్ బాస్ సీజన్ 6 విన్నర్ అని చెప్పుకోవడం తప్పితే మిగిలిందేమీ లేదు పాపం. అసలు రేవంత్ కంటే శ్రీహాన్‌కి ఎక్కువ ఓట్లు వచ్చాయా? అది నిజమేనా? అది కూడా చాలా తక్కువ మార్జిన్ అంటూ నాగార్జున పదేపదే చెప్పడం చూస్తే… కొంచెం తేడాగానే అనిపించింది ప్రేక్షకులకు.
ఒక సీజన్‌లో ఇద్దరు విజేతల్ని ప్రకటించడం తెలుగులోనే కాదు.. దేశంలోనే ఇదే తొలిసారి. ఈ దేశంలో జరిగిన 28 సీజన్స్‌లో ఎప్పుడూ ఇలా జరగలేదు.. సీజన్‌కి ఇద్దరు విన్నర్స్.. శ్రీహాన్‌కి రూ.40 లక్షల ప్రైజ్ మనీ వస్తే.. విన్నర్ ట్రోఫీ రేవంత్ తీసుకున్నాడు. శ్రీహాన్ రూ.40 లక్షల సూట్ కేసుని తీసుకుని రేవంత్‌ని విన్నర్‌ని చేశాడు.
టాప్ 3 కంటెస్టెంట్లు ఉన్నప్పడు ఎప్పటిలాగే బ్రీఫ్ కేస్ తో గెస్ట్ గా వచ్చిన రవితేజ ఎంట్రీ ఇచ్చాడు. 30 శాతం వరకూ మనీ ఆఫర్ చేశాడు. అయినా సరే దానిని ఎవరూ తీసుకోలేదు. కీర్తిని డబ్బులు తీసుకోమని ఫ్రెండ్స్ చెప్పినా తీసుకోలేదు. దాంతో ఆమె ఉత్త చేతులతో బయటకు రావలసి వచ్చింది. చివరకు రేవంత్, శ్రీహాన్ మిగిలారు. అప్పడు నాగార్జు గోల్డెన్ బ్రీఫ్ కేస్ తో హౌస్ లోకి వెళ్ళాడు. ముందు 25 లక్షలు అన్నాడు. తర్వాత 30 అన్నాడు. ఇద్దరూ తీసుకోవడానికి ముందుకు రాకపోవడంతో దానిని 40 లక్షలు చేశాడు. ఎమౌంట్ తెలిసాక శ్రీహాన్ ను డబ్బులు తీసుకోమని చాలా మంది చెప్పారు. చావరకు అతని అమ్మానాన్నా కూడా తీసుకోమని చెప్పడంతో వారి మాట మీద విన్నర్ ట్రోఫీని రేవంత్ కి ఇచ్చి డబ్బులు తాను తీసుకున్నాడు. అలా రన్నరప్ 40 లక్సలు గెలుచుకుంటే…విన్నర్ 10 లక్షలతో సరిపెట్టుకున్నాడు. పోనీలే డబ్బులు పోతే పోయాయి భూమి, కారు ఉంది కదా అనుకుంటే శ్రీహాన్ కి కూడా ప్లాట్ సగం ధరకే ఇస్తున్నట్టు బిగ్ బాస్ ప్రకటించడంతో రేవంత్ కు ఆ ఆనందం కూడా మిగల్లేదు.
మనీ తీసుకున్నార శ్రీహాన్ పెద్ద స్పీచే ఇచ్చాడు. నన్ను ఈ స్థాయిలో నిలిపిన ప్రేక్షకులకు.. మా అమ్మ నాన్నలకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. నాకు మంచి ఫ్రెండ్స్‌ని ఇచ్చింది బిగ్ బాస్. నా ఫ్రెండ్ విన్నర్ కావడం చాలా హ్యాపీగా ఉంది’ అంటూ స్పీచ్ ఇచ్చాడు. అయితే అసలు విన్నర్ రేవంత్ కాదురా నాయనా.. నువ్వు.. నీకే ఓట్లు ఎక్కువ వచ్చాయని చివర్లో నాగార్జున బాంబ్ పేల్చడంతో నోరెళ్లబెట్టాడు. అతనికే కాదు.. షో చూసిన వాళ్లందరకీ ఇది పెద్ద షాకింగ్.శ్రీహాన్‌నే రియల్ విన్నర్ అని చివర్లో ట్విస్ట్ ఇవ్వడంతో రేవంత్ కి కూడా నోట మాటరాలేదు.
సో మొత్తానికి టైటిల్ విన్నర్ రేవంత్ అయినా రియల్ విన్నర్ మాత్రం శ్రీహాన్ అన్నమాట. శ్రీహాన్ నక్కతోక వచ్చినట్టు ఉన్నాడు. సీజన్ మొత్తం ఎవరు ఏమనుకున్నా.. ఎన్ని తిట్టుకున్నా.. తగ్గేదేలే అన్నట్టుగానే గేమ్ ఆడాడు. చివరికి విన్నర్ కంటే ఎక్కువగా నిలిచి షాక్ ఇచ్చాడు.