బిగ్‌బాస్ పరీక్షే పెట్టాడు.. కావాల్సినవారు కంటిముందే కానీ.. - MicTv.in - Telugu News
mictv telugu

బిగ్‌బాస్ పరీక్షే పెట్టాడు.. కావాల్సినవారు కంటిముందే కానీ..

September 19, 2019

Bigg Boss test .. Before the eyes of family members..

బిగ్‌బాస్ సీజన్3 గురువారం చాలా ఆసక్తికరంగా సాగింది. ముందుగా కెప్టెన్సీ టాస్కులో బాబా భాస్కర్, మహేష్ విట్టాలు పోటీపడ్డారు. వెరైటీగా ఎవరి మెడలో ఎక్కువ పూలదండలు పడితే వారే ఇంటి కెప్టెన్ అవుతారని బిగ్‌బాస్ చెప్పారు. ఆ దండలను ఇంటి సభ్యులే వేస్తారు. ఆలోపు అందరి దగ్గరకు వెళ్లి వీరిద్దరు తమను ఇంటి కెప్టెన్‌గా ఎన్నుకోవాలని ప్రచారం చేస్తూ అభ్యర్థించుకోవాలి. అయితే ఇంతవరకు మహేష్ ఇంటి కెప్టెన్‌గా ఎన్నిక అవలేదు. దీంతో అందరు మహేష్‌కే దండలు వేసి అతనిని ఇంటి కెప్టెన్‌గా ఎన్నుకున్నారు. 

అనంతరం బిగ్‌బాస్ ఇంటి కెప్టెన్‌గా ఎన్నికైన మహేష్‌కు శుభాకాంక్షలు చెప్పారు. ఆ తర్వాత వారందరికీ ఓ టాస్క్ ఇచ్చినట్టు వివరణ ఇచ్చారు.  ఆ వివరణలో తాను ఆదేశించేవరకు ఎవరూ మాట్లాడవద్దని చెప్పారు. తర్వాత టీవీలో వారివారి కుటుంబ సభ్యులను చూపించారు. దీంతో అందరూ షాక్ అయ్యారు. అదే తీరులో భావోద్వేగానికి లోనయ్యారు. తమవాళ్లను చూసుకుని ఒక్కక్కరు ఎప్పుడెప్పుడు మాట్లాడాలి, వెళ్లి గుండెలకు హత్తుకోవాలా అని ఉబలాటపడ్డారు. కానీ, బిగ్‌బాస్ ఆదేశం వచ్చేవరకు ఎవ్వరూ నోరు మెదపవద్దు, సోఫాలోంచి లేవకూడదు. వారందరిలో వారి కుటుంబ సభ్యులతో ఇద్దరికి మాత్రమే మాట్లాడే అవకాశాన్ని ఇచ్చి బిగ్‌బాస్ మిగతావాళ్లను ఇరుకునపెట్టారు.

ఈ క్రమంలో అందరికందరు తమవాళ్లతో మాట్లాడాలి అనుకున్నారు. కుటుంబ సభ్యులు అందరిని ఓ గదిలోనే వుంచారు. ఈ క్రమంలో వితిక సోదరుడు బాక్స్ తెరిచాడు. అందులో అతనికి బిగ్‌బాస్ కన్ను వచ్చింది. దీంతో వితిక ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అలా ఇంకొకరి బాక్సులో బిగ్‌బాస్ కన్ను వస్తే వారితో ఇంటి సభ్యులు ఒకరు మాట్లాడతారు. అయితే ఎపిసోడ్ అంతటితో అయిపోయింది. రేపు ప్రసారం అయ్యే ఎపిసోడ్‌లో ఎవరికి వారి కుటుంబ సభ్యులతో మాట్లాడే ఛాన్స్ వచ్చిందనేది నేటికి సస్పెన్స్. ఈ నేపథ్యంలో రేపటి ఎపిసోడ్‌ కోసం బిగ్‌బాస్ అభిమానులు చాలా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.