బిగ్‌బాస్‌లో ఇష్టమైనవారు వాళ్లే.. యాంకర్ రవి - MicTv.in - Telugu News
mictv telugu

బిగ్‌బాస్‌లో ఇష్టమైనవారు వాళ్లే.. యాంకర్ రవి

September 10, 2019

Anchor Ravi....

యాంకర్ రవి అనగానే శ్రీముఖి.. శ్రీముఖి అనగానే రవి పేర్లు ఆటోమెటిగ్గానే వచ్చేస్తాయి. ‘పటాస్‌’లాంటి పెద్ద షోను వదిలేసుకుని శ్రీముఖి బిగ్‌బాస్ సీజన్3 లోకి ఎంట్రీ ఇచ్చింది. యాభై రోజులు పూర్తి చేసుకున్న బిగ్‌బాస్‌లో శ్రీముఖి టాస్‌లు బాగా ఆడుతూ కొనసాగుతోంది. అయితే రవి గనక బిగ్‌బాస్ ఇంట్లో ఎవర్ని సపోర్ట్ చేస్తాడంటే కచ్చితంగా శ్రీముఖికే అంటారు ఎవరైనా. కానీ, రవి నోట శ్రీముఖి పేరు రాలేదు. తనకు బిగ్‌బాస్ హౌస్‌లో బాబా భాస్కర్‌, రాహుల్‌, వరుణ్‌ గురించి మంచిగా వినిపిస్తోందని వీడియోలో చెప్పాడు. 

అంతేకాకుండా అలీ రెజా మళ్లీ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది.. అతనే తనకు ఇష్టమైన కంటెస్టెంట్ అని అన్నాడు. బిగ్‌బాస్‌ను అంతగా ఫాలో అవ్వట్లేదు అని చెప్పాడు కానీ, శ్రీముఖి పేరును ఎక్కడా ప్రస్తావించలేదు. దీంతో రవిపై కొందరు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరూ కలిసి ఎన్నో షోలు చేశారు.. కనీసం ఒక్కమాట కూడా శ్రీముఖి గురించి చెప్పకపోవడం హాస్యాస్పదం అంటూ శ్రీముఖి ఫాలోవర్లు అంటున్నారు.