భవనాలు కాదు... బ్యాటరీ   - MicTv.in - Telugu News
mictv telugu

భవనాలు కాదు… బ్యాటరీ  

November 25, 2017

వీటిని చూస్తుంటే ఏమనిపిస్తోంది? ఉద్యోగుల కోసం కట్టిన క్వార్టర్స్‌ ‌మాదిరి ఉన్నాయి కదా. కానీ అవి భవనాలు కాదు. ప్రపంచంలోనే అతిపెద్ద లిథియం బ్యాటరీ ఇది. దక్షిణ ఆస్ట్రేలియాలో కరెంటు కోతలకు చెక్‌ పెట్టేందుకు 5 కోట్ల డాలర్లతో దీన్ని తయారు చేశారు. లిథియం అయాన్ తో కూడిన ఈ బ్యాటరీని వ్యాపారవేత్త ఎలాన్‌ మస్క్‌  మాట ప్రకారం.. 100 రోజుల్లోగా దీన్ని రూపొందించారు.ప్రజల కోసం సొంత డబ్బుతో దీన్ని తయారు చేశారు. వందరోజుల్లో దీన్ని తయారు చేయలేకపోతే మొత్తం ఖర్చునే తానే భరించి ఉచితంగా ఇస్తానని అతడు హామీ ఇచ్చాడు. త్వరలోనే దీనికి పరీక్షలు నిర్వహిస్తారు.