బ్రహ్మాండామ్లేట్.. - MicTv.in - Telugu News
mictv telugu

బ్రహ్మాండామ్లేట్..

August 17, 2017

అండపిండ బ్రహ్మాండం అంటే అండాలతో.. అదేనండి.. కోడిగుడ్లతో బ్రహ్మాండం చేయడం అనుకున్నట్లుంది వీళ్లు. బెల్జియంలోని మాల్మెడే పట్టణవాసులకు ఆమ్లెట్లంటే పెనంపై పడి దొర్లేటంత పిచ్చి. ఏటా భారీఎత్తున గుడ్లను కొట్టి పెనాలపై పోస్తుంటారు.

ఈసారి రికార్డు కోసం 10వేల గుడ్లతో ఇలా ఊరి నడిబొడ్డున పొయ్యి వెగిలించి భారీ ఆమ్లెట్ వేశారు. వేయడమైతే వేశారుగాని దాన్ని సరిగ్గా.. ఎక్కడా విరగకుండా కాల్చారా అని అనుమానపడక్కర్లేదు. 4 అడుగుల వెడల్పున్న గుడ్డట్టును సరిగ్గానే కాల్చారు. ఒట్టి ఆమ్లెట్ ఏం బావుంటుందని కాస్త పందిమాంసం, బీన్స్, సువాసన వెదజెల్లే ఆకులు గట్రా కలిపారు. ఎంచక్కా ఘుమఘుమలాడుతూ తయారైన అట్టును ముక్కలు కోసి జనానికి పంచిపెట్టారు.