కొనుగోలుదారులకు బిగ్‌షాక్.. 6శాతం పెంపు - MicTv.in - Telugu News
mictv telugu

కొనుగోలుదారులకు బిగ్‌షాక్.. 6శాతం పెంపు

May 10, 2022

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. వాహనాల జీవిత కాల పన్ను(లైఫ్ ట్యాక్స్)ను పెంచుతూ ప్రకటన విడుదల చేసింది. ఇక నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా వాహనాన్ని కొనుగోలు చేసే కొనుగోలుదారులకు ఈ పన్ను వర్తిస్తుందని అధికారులు తెలిపారు.

”ఇప్పటివరకు అమలులో ఉన్న 2 శ్లాబుల విధానాన్ని ప్రభుత్వం 4 శాబులకు పెంచింది. గతంలో రూ.10 లక్షల లోపు ఒక పన్ను, రూ. 10 లక్షల దాటితే మరోపన్ను ఉండేది. ఇకనుంచి 4 విభాగాలుగా విభజించి, పన్నులను వసూలు చేయనున్నాం. ఒకటి నుంచి 6శాతం అదనంగా పెంచాం. ఇక, బైకుల విషయానికొస్తే, 1 నుంచి 9 శాతం వరకు పన్ను పెరిగింది. గతంలో కొత్త వాహనాలకు 9శాతం ట్యాక్స్ ఉండేది. తాజాగా రూ. 50 వేల విలువ దాటిన కొత్త వాహనంపై 12 శాతం పన్ను చెల్లించాలి. ఒకే వ్యక్తి రెండో వాహనాలకు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే, అదనంగా 2శాతం కట్టాలి.”

ఇక, మూడు, నాలుగు చక్రాల కొత్త వాహనాలకు రూ.5 లక్షల లోబడి ఉన్న వాహనాలకు 18శాతం, రూ.10 లక్షల లోపు ఉన్న వాహనాలకు 14 శాతం, రూ.20 లక్షల లోపు ఉన్న వాహనాలకు 17 శాతం, రూ.20 లక్షలపైబడి ఉన్న వాహనాలకు 18 శాతంగా అధికారులు ట్యాక్సిలను నిర్ణయించారు. రవాణా వాహనాలకు సంబంధించి రూ. 5 లక్షల లోబడి ఉన్న వాహనాలకు 15 శాతం, 10 లక్షల లోపు ఉన్న వాహనాలకు 18శాతం, రూ.20 లక్షలు ఉన్న వాహనాలకు 19శాతం, రూ.20 లక్షల పైబడి ధర ఉన్న వాటికి 20 శాతంగా పెంచిన్నట్లు అధికారులు పేర్కొన్నారు.