మామూలుగా ఏ తల్లిదండ్రులైనా.. తమ పిల్లల స్కూల్ ఫీజులు పెరిగాయని, పిల్లలకు పుస్తకాలు ఇవ్వలేదని రోడ్డెక్కి నిరసనలు తెలుపుతుంటారు. ధర్నాలు, దీక్షలు చేస్తుంటారు. ఇలాంటి ఘటనలు ప్రతీ చోటా చూస్తుంటాం. కానీ బీహార్లో ఓ వ్యక్తి దీనికి భిన్నంగా ప్రవర్తించాడు. ఇవ్వాల్సిన యూనిఫాం ఇవ్వలేదని స్కూల్కు ఏకంగా పెద్ద కత్తి పట్టుకుని వెళ్లి.. ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులను బెదిరించాడు. అరారియాలో ఈ ఘటన చోటుచేసుకుంది.
తన పిల్లల చదువుతున్న పాఠశాలకు ఒంటిపై చొక్కా లేకుండా, కేవలం లుంగి మాత్రమే ధరించి తమిళ సినిమాలోని విలన్లా కత్తి పట్టుకుని వెళ్లాడు. తన పిల్లలకు రావాల్సిన స్కూల్ యూనిఫాం, పుస్తకాలు అందలేదని.. వాటికి బదులుగా డబ్బులు ఇవ్వాలని ప్రధానోపాధ్యాయుడిని బెదిరించాడు. డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తానని హెచ్చరించాడు. 24 గంటల్లో డబ్బులు ఇవ్వకుంటే మళ్లీ వస్తానని ఉపాధ్యాయులను బెదిరించాడు. చివరికి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ ఘటనను అక్కడే ఉన్న కొంత మంది తమ ఫోన్ లో రికార్డు చేశారు. ప్రస్తుతం ఈ ఘటన నెట్టింట వైరల్ గా మారింది. దీంతో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి వివరాలు తెలిపారు. అతడు పదే పదే ఇలాంటి బెదిరింపులకు పాల్పడుతుంటాడని పోలీసులకు వెల్లడించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
Araria Dist, Father named Akbar reached his child's school with a sword & threatened teachers just cause his son didn't get money for school uniform.
He has all the rights as Manmohan said "Desh ke sansadhno pe pahle haq [email protected] ka hai" They are just claiming in their own way. pic.twitter.com/9M1UNTBrPt
— P!YU$H S (@SpeaksKshatriya) July 8, 2022