బిహార్‌లో ఎన్డీఏ పైచేయి.. ఆర్జేడీ గట్టి పోటీ..  - MicTv.in - Telugu News
mictv telugu

బిహార్‌లో ఎన్డీఏ పైచేయి.. ఆర్జేడీ గట్టి పోటీ.. 

November 10, 2020

Bihar assembly election results

బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార ఎన్డీఏ కూడమి ముందంజలో సాగుతోంది. విపక్ష మహాకూటమి గట్టి పోటీ ఇస్తోంది. బీజేపీ, జేడీయూ కూటమి 124 స్థానాల్లో మెజారిటీలో సాగుతోంది. ఆర్జేడీ, కాంగ్రెస్‌ల మహాకూటమి 107 స్థానాల్లో ముందంజలో ఉంది. బీజేపీ తన మిత్రపక్షమైన జేడీయూకంటే ఎక్కువ సంఖ్యలో సీట్లు గెల్చుకుంటోంది. 

తాజా కౌంటింగ్ ఫలితాల ప్రకారం.. బీజేపీ 73 స్థానాల్లో, ఆర్జేడీ 73 స్థానాల్లో ఆధిక్యతలో ఉన్నాయి. కాంగ్రెస్ 24 చోట్లు, జేడీయూ 41 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. ఎల్జేపీ కేవలం రెండు స్థానాల్లో మాత్రమే మెజారిటీలో ఉంది. 243 స్థానాలున్న అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు 122 స్థానాలు అవసరం. కౌంటింగ్ ఫలితాల్లో ఎన్డీఏ ఇప్పటికే ఈ మార్క్ దాటేసింది. బీజేపీకి ఎక్కువ స్థానాలు దక్కే అవకాశం ఉండడంతో కాబోయే ముఖ్యమంత్రి కూడా ఆ పార్టీ నుంచే ఉంటారని భావిస్తారు. అయితే మిత్రబంధాన్ని గౌరవించి నితీశ్ కుమార్‌కే మళ్లీ పట్టం కట్టాలని జేడీయూ శ్రేణులు కోరుతున్నాయి. కౌంటింగ్ ఫలితాలు.. ఎగ్జిట్ పోల్స్‌కు భిన్నంగా ఉండడం గమనార్హం. తేజస్వీ యాదవ్ సారథ్యంలోని మహాఘట్ బంధన్ కూటమి అధికారంలోకి వస్తుందని పలు సర్వేలు చెప్పడం తెలిసిందే.