బీహార్ ఎన్నికలను నిర్వహించి తీరుతాం..సీఈసీ - MicTv.in - Telugu News
mictv telugu

బీహార్ ఎన్నికలను నిర్వహించి తీరుతాం..సీఈసీ

August 11, 2020

Bihar assembly polls will be held on time

నవంబరు 29వ తేదీతో బీహార్ అసెంబ్లీ కాలపరిమితి ముగియనున్న సంగతి తెల్సిందే. దీంతో అక్టోబర్-నవంబర్ నెలల్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సిన ఉంది. కానీ, దేశంలో కరోనా వైరస్ ప్రభావం ఇంకా తగ్గుముఖం పట్టలేదు. దీంతో ఈ ఎన్నికలను వాయిదా వేయాలని రాష్ట్రీయ జనతాదళ్, లోక్ జనశక్తి పార్టీలు బీహార్ అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నాయి. అలాగే ప్రజల భద్రత ముఖ్యమని, ఈ పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించవద్దని కాంగ్రెస్ నాయకుడు అఖిలేష్ ప్రసాద్ సింగ్ తెలిపారు. దీంతో ఈ ఎన్నికలు నిర్వహిస్తారా? లేదా అనే విషయమై ప్రజల్లో అనుమానాలు మొదలయ్యాయి. 

ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక వ్యాఖ్యలు చేసింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు సకాలంలోనే నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల కమిషన్ ముఖ్య ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా తెలిపారు. ఎన్నికలు నిర్వహించడానికి కరోనా వ్యాప్తి అడ్డుకాదని తెలిపారు. అన్ని రకాల ముందు జాగ్రత్తలు తీసుకొని ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. ఈ ఎన్నికల నిర్వహణపై రాజకీయ పార్టీల అభిప్రాయాలు తీసుకునేందుకు మంగళవారం గడువు విధిస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది.