కటింగ్ చేయలేదని కాల్చి చంపేశారు..
‘ఏం తమషాగా ఉందా? నువ్వు కాకపోతే మాకు ఎవరు కటింగ్ చేస్తారు? మర్యాదగా వస్తావా రావా? ఈ ఊర్లో ఎవరైనా చూస్తారు. అందుకే పక్కూరికి వెళ్దాం. చాటుగా కటింగ్ చెయ్..’ అంటూ బెదిరించిన యువకులు ఓ క్షురకుడిని నమ్మించి తీసుకెళ్లి కాల్చిచంపేశారు. బిహార్‌లోని బంకా జిల్లాలో ఆదివారం ఈ దారుణం జరగింది.
మైన్వా గ్రామానికి చెందిన 42 ఏళ్ల దినేశ్ ఠాకూర్ క్షురకుడు. ఇటీవలే ముంబై నుంచి రావడంతో హోం క్వారంటైన్లో ఉన్నాడు అ గ్రామానికి బివిప్ దానే, కులు తదితర జులాయి యువకులు అతణ్ని తమకు కటింగ్, షేవింగ్ చేయాలని ఒత్తడి తెచ్చారు. లాక్ డౌన్‌లో తాను చేయనని, పోలీసులకు తెలిస్తే తనను పట్టుకుపోతారని అతడు అంగీకరించలేదు. దీంతో కోపం పెంచుకున్న ముఠా అతణ్ని పక్కూరికి తీసుకెళ్లింది. పొలాల వద్ద కాల్చి చంపేసింది. విషయం తెలుసుకున్న దినేశ్ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుల్లో ఇద్దర్ని పట్టుకున్నామని, మిగతా వారి కోసం గాలిస్తున్నామని పోలీసులు చెప్పుకొస్తున్నారు.