సీఎం సారూ.. సర్కారు బళ్లో సదవ, ప్రైవేటు బళ్లో వెయ్యి వైరల్ వీడియో - MicTv.in - Telugu News
mictv telugu

సీఎం సారూ.. సర్కారు బళ్లో సదవ, ప్రైవేటు బళ్లో వెయ్యి వైరల్ వీడియో

May 17, 2022

‘సీఎం సారూ.. నేను సర్కారు బడుల్లో చదవను. మా బడిలో టీచర్లకు చదువు రాదు. ఇంగ్లీషు పదాలు సరిగ్గా రాయలేరు. మాట్లాడలేరు. నేను పెద్ద పెద్ద చదువులు చదవాలి. ప్లీజ్.. నన్ను ప్రైవేటు బడిలో వేయండి. నన్ను ఏ సర్కారు బడికీ పంపొద్దు.. ప్రైవేటు బడికే పోతాను..’’ అంటూ ఓ 11 ఏళ్ల బుడ్డోడు ముఖ్యమంత్రికి దిమ్మదిరిగే షాకిచ్చాడు. బిహార్ సీఎం నితీశ్ కుమార్ స్వగ్రామం నలంద జిల్లా కల్యాణ్ బిఘాలో ఈ ఉదంతం చోటు చేసుకుంది. నీమా గ్రామానికి చెందిన సోనూ అనే పిలగాడు సీఎం పర్యటనలో కలకలం రేపాడు. నితీశ్ కల్యాణ్ బిఘాకు వస్తున్నాడని తెలుసుకున్న సోనూ అక్కడికి చేరుకున్నాడ. రెండు చేతులూ జోడించి కన్నీళ్లు పెట్టుకుంటూ ఆయనకు తన గోడు వెళ్లబోసుకున్నాడు.

దీంతో సీఎం ఆ పిల్లాడిని మంచి స్కూల్లో వేయాలని అధికారులను ఆదేశించారు. సోనూ వీడియోలు మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.సోనూ తండ్రి తాగుడుకు బానిసై కుటుంబాన్ని పట్టించుకోవడం లేదు. ఆ చిన్నోడి బాగోగులు చూసుకుంటున్న బంధువులు చదువు మానెయ్యాలని అంటున్నారు. చదువుపై ఎంతో ప్రేమ ఉన్న సోనూ చురుకైన కుర్రాడు. విద్యావ్యవస్థ మొత్తం మారాలని, బాగా చదువుకున్న టీచర్లను నియమించాలని కోరుతున్నాడు. సోనూ తనకంటే చిన్నపిల్లలకు 40 మందికి ట్యూషన్ చెబుతూ, వాళ్లిచ్చే చిల్లర డబ్బులతో పుస్తకాలు, పెన్నులు కొనుక్కుంటున్నాడు.