Bihar Cabinet expansion: RJD set for lion's share as 30 MLAs likely to be sworn-in today
mictv telugu

నేడు బిహార్ మంత్రివర్గ విస్తరణ.. ఆర్జేడీకే ఎక్కువ కేబినెట్ సీట్లు

August 16, 2022

బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఇవాళ తన మంత్రివర్గాన్ని విస్తరించనున్నట్లు రాజకీయ వర్గాలు తెలిపాయి. విస్తరణలో భాగంగా కూటమి మిత్రపక్షమైన రాష్ట్రీయ జనతాదళ్‌కు అత్యధిక స్థానాలు కేటాయించారని తెలిసింది. ఆర్జేడీకి 16 కేబినెట్ సీట్లు, నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూకు 11మందికి చోటు దక్కే అవకాశం ఉంటుందని సమాచారం. కాంగ్రెస్‌కు చెందిన ఇద్దరికి, జితిన్ రామ్ మాంఝీకి చెందిన హెచ్‌ఏఎం(హిందుస్తానీ అవామ్ మోర్చా) నుంచి ఒకరికి, మరో స్వతంత్ర సభ్యుడికి కూడా మంత్రివర్గంలో చోటుదక్కే అవకాశం ఉంది. బిహార్ కేబినెట్‌లో గరిష్టంగా 36 మంది మంత్రులు ఉండవచ్చు.

ఉదయం 11.30 గంటలకు రాజ్‌భవన్‌లో ఈ వేడుక జరగనుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఉపముఖ్యమంత్రిగా తేజస్వీ యాదవ్ ఆగస్టు 10న ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన పార్టీ నుంచి గతంలో ఉన్న మంత్రుల్లో ఒకరిని మినహాయించి అందరినీ కొనసాగించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. నిర్వహించారు. బీజేపీతో పొత్తును తెంచుకుంటానని ప్రకటించిన నితీష్ కుమార్ బుధవారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఆయనతో పాటు ఉప ముఖ్యమంత్రిగా తేజస్వి యాదవ్ ప్రమాణం చేశారు.