బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ నేత నితీశ్ కుమార్ త్రుటితో దాడి నుంచి తప్పించుకున్నారు. విరిగిన కుర్చీ ముక్కను ఓ యువకుడు.. నడుస్తూ వస్తున్న సీఎంను టార్గెట్ చేసుకుని విసిరేశాడు. అయితే అది తనకు తగలడానికి ఒక క్షణం ముందే నితీశ్ కాస్త ఆగడంతో దాడి తప్పింది. ఔరంగాబాద్ జిల్లాలో సోమవారం నిర్వహించి సమాధాన్ యాత్రలో ఈ సంఘటన చోటుచేసుకుంది. కుర్చీ ముక్క పైనుంచి దూసుకురావడంతో పోలీసులు, భద్రతాసిబ్బంది సీఎం చుట్టూ రక్షణ వలయంగా ఏర్పడి ఆయనను పక్కకు తీసుకెళ్లారు. పారిపోతున్న దుండగుణ్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టు, సంక్షేమ పథకాలను సమీక్షించడానికి సీఎం ఈ యాత్ర చేస్తున్నారు. అయితే ఇదంతా స్టంట్ అని విపక్షాలు మండిపడుతున్నాయి.
#WATCH | Bihar: A part of a broken chair was hurled towards Bihar CM Nitish Kumar during Samadhan Yatra in Aurangabad. pic.twitter.com/MqeR6MLnFR
— ANI (@ANI) February 13, 2023