Bihar chief minister nitish kumar resigns
mictv telugu

నితీశ్ రాజీనామా.. ఆర్జేడీతో కలసి కొత్త సర్కారు

August 9, 2022

బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ నేత నితీశ్ కుమార్ ఊహించినట్లే చేశారు. ఆయన మంగళవారం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా సమర్పించారు. గవర్నర్‌ ఫాగు చౌహాన్‌ను కలసి రాజీనామా లేఖను అందించారు. తదుపరి వ్యూహంలో భాగంగా మాజీ సీఎం, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఇంటికి వెళ్లి లాలూ భార్య, మాజీ సీఎం రబ్రీదేవితో భేటీ అయ్యారు. లాలూ ప్రస్తుతం జైల్లో ఉన్న సంగతి తెలిసిందే.

గవర్నర్‌తో భేటీకి ముందు నితీశ్ పార్టీ నేతలతో సమావేశం నిర్వహించారు. ఎన్డీఏతో తెగతెంపులు చేసుకోవాలని నిర్ణయించారు. జేడీయూ, ఆర్జేడీ కొత్త భాగస్వామ్యంలో, కాంగ్రెస్ మద్దతుతో ఆయన మళ్లీ సీఎం గద్దె ఎక్కునున్ననట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి రబ్రీదేవీ అంగీకరించినట్లు తెలుస్తోంది. అధికార పంపకంలో భాగంగా లాలూ తనయుడు తేజస్వి యాదవ్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి కట్టబెడతారని వార్తలు వినిపిస్తున్నాయి.