Bihar: Class 7 exam paper frames Kashmir as separate country; sparks row
mictv telugu

‘కశ్మీర్‌ దేశస్థులను ఏమని పిలుస్తారు?’.. ప్రశ్నాపత్రంపై వివాదం

October 19, 2022

కశ్మీర్ మనదేశంలో ఓ భాగం కానట్టు ఏడో తరగతి ప్రశ్నా పత్రంలో వచ్చిన ఓ ప్రశ్న.. ఎడ్యూకేషనల్ బోర్డు నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. విద్యార్థులకు ఇచ్చే ప్రశ్నాపత్రాలలో కశ్మీర్ను ప్రత్యేక దేశంగా పేర్కొనడం వివాదానికి దారితీసింది. దీనిపై సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బిహార్ కృష్ణగంజ్లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో జరుగుతున్న అర్ధవార్షిక పరిక్షల్లో ఏడవ తరగతి విద్యార్థులకు ఈ ప్రశ్న ఎదురైంది.

‘చైనా, నేపాల్, ఇంగ్లండ్, కశ్మీర్, భారత్లోని ప్రజలను ఏమని పిలుస్తారు?’ అంటూ ప్రశ్న అడిగారు. దీనికి రెండు మార్కులు కూడా కేటాయించారు. అన్నీ దేశాల పేర్లు ఉండగా.. కశ్మీర్ను సైతం అందులో భాగం చేయడం ఇప్పుడు వివాదాస్పదమైంది. ఇందుకు సంబంధించిన ప్రశ్నాపత్రం సోషల్ మీడియాలోవైరల్గా మారింది. ఏకంగా ప్రభుత్వ ఎడ్యుకేషన్‌ ప్రాజెక్టు కౌన్సిల్‌ ఆధ్వర్యంలో జరుగుతున్న పరీక్షల్లో ఇలాంటి తప్పులు రావడమేంటని విపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. ప్రశ్నపత్రం రూపొందించిన వారు చేసిన ఈ పొరపాటు ఇప్పుడు బీహార్ లో రాజకీయ దుమారాన్ని రేపుతున్నది. ఈ ప్రశ్నకు కశ్మీర్ భారత్లో భాగం కాదని అదొక ప్రత్యేక దేశమనేలా అర్థం వస్తోందని నెటిజన్లు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఇలాంటి ఘటన జరగడం ఇదే తొలిసారి కాదని పాఠశాల యాజమాన్యాలు చెబుతున్నాయి. 2017లోనూ బోర్డు ఇదేతరహా ప్రశ్నను అడిగిందని మండిపడుతున్నాయి. ఇది పూర్తిగా మానవ తప్పిదమని బోర్డు వివరణ ఇచ్చింది. ఇది కుట్రపూరిత చర్య అని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.