సీఎంను చంపితే రూ.25 లక్షలు ఇస్తానన్నాడు..  - MicTv.in - Telugu News
mictv telugu

సీఎంను చంపితే రూ.25 లక్షలు ఇస్తానన్నాడు.. 

April 1, 2020

bihar cm nitish kumar 25 lakhs.

ఏకంగా ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిని చంపుతానని ఓ యువకుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో కలకలం రేపుతోంది. ఈ సంఘటన బీహార్ రాష్ట్రంలో జరిగింది. ఆ రాష్ట్ర సీఎం నితీశ్‌ కుమార్‌ను చంపితే రూ.25 లక్షలు ఇస్తానంటూ ధరేంద్ర కుమార్ పాండే అనే యువకుడు సోషల్‌ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో వైరల్ అయింది. దీంతో రోహ్‌తాస్‌ పరిధిలోని దినారా స్టేషన్‌ హౌస్‌ పోలీసు ఆఫీసర్‌ సియారామ్ సింగ్ అప్రమత్తయ్యారు.

కేసు నమోదు చేసి ఐపీ అడ్రస్ ద్వారా నిందితుడిని గుర్తించారు. తన కోసం పోలీసులు వెతుకున్నారని తెలుసుకున్న ధర్మేంద్ర పంజాబ్ పారిపోయాడు. దీంతో అతడి మొబైల్ ఫోన్ ద్వారా లూథియానాలో ఉన్నట్లు గుర్తించి మంగళవారం అరెస్ట్ చేశారు. ధర్మేంద్ర నేరం అంగీకరించడంతో అనేక సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ధర్మేంద్ర కుమార్ పాండేను రోహ్‌తాస్ జిల్లా తోడా గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. అతడి మానసిక పరిస్థితి సరిగ్గా లేదని తెలుస్తోంది.