సీఎం వర్సెస్ డిప్యూటీ సీఎం..ఎందాకా వెళ్తుందో.. - MicTv.in - Telugu News
mictv telugu

సీఎం వర్సెస్ డిప్యూటీ సీఎం..ఎందాకా వెళ్తుందో..

July 16, 2017

బీహార్ లో బీజేపీ పెట్టిన చిచ్చు రాజుకుంటోంది. సీఎం నితీష్ లాలూ సేనలకు మధ్య విభేదాలు భగ్గమంటున్నాయి. ఆర్జేడీ, జేడీయూ మధ్య ఘర్షణ వాతావరణం తీవ్ర రూపం దాల్చింది. జేడీయూ చీఫ్, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, ఆర్జేడీ నేత, ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ కలిసి ఒకే వేదికను పంచుకోలేనంత స్థాయికి చేరింది. ముందు ముందు ఎందాకా వెళ్తుందో..?

బిహార్ రాష్ట్ర ప్రభుత్వం విశ్వ యువ కౌశల్ దివస్‌ను పాట్నాలో నిర్వహించింది. ఆహ్వాన పత్రికలో సీఎం నితీశ్‌ కుమార్‌తోపాటు ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ పేరు కూడా ఉంది. వేదికపై తేజస్వి కోసం ఓ కుర్చీని కూడా వేశారు. ఆ కుర్చీ ఎదురుగా ఉన్న బల్లపై తేజస్వి పేరు, హోదాలతో కూడిన నేమ్‌ప్లేట్‌ను ఉంచారు. అయితే కార్యక్రమం ప్రారంభమవడానికి కాస్త ముందుగా ఆ నేమ్‌ప్లేట్‌పై నీలం రంగు కాగితాన్ని కప్పి కవర్ చేశారు. ఇంకా కాసేపటకి ఆ నేమ్‌ప్లేట్‌ను పూర్తిగా తొలగించారు. అయితే ఈ కార్యక్రమానికి తేజస్వి కావాలనే గైర్హాజరయ్యారని సమాచారం. కార్యక్రమానికి ముందు జేడీయూ అధికార ప్రతినిధి కే సీ త్యాగి మాట్లాడుతూ గతంలో ఇటువంటి పరిస్థితులు ఎదురైనపుడు నితీశ్ కుమార్ రాజీనామా చేశారన్నారు. అటు లాలూ ప్రసాద్ యాదవ్ మాత్రం తన కుమారుడు రాజీనామా చేసే ప్రసక్తే లేదన్నారు.

ఎందుకంటే కూర్చున్న కొమ్మను నరుక్కోలేడుగా..ఎంతైనా లాలూ భలే చాలూ కదా…వెళ్లే గొట్టేదాకా నితీష్ తోనే ఉంటారు. లాలూ పాలిట్రిక్స్ అంటే ఇంతేమరి.