అతడు ఓ దినసరి కూలీ..ప్రతీ నెల రూ.12 వేల నుంచి 15 వేల వరకు సంపాదిస్తాడు.రెక్కాడితేనే గాని డొక్కా ఆడనటువంటి కుటుంబం వారిది. అలాంటి వ్యక్తికి ఐటీ శాఖ నుంచి రూ.14 కోట్లు పన్ను కట్టాలంటూ నోటీసులు అందాయి. అతని పేరుపై పలు వ్యాపారాలున్నాయని, వాటిపై పన్ను కట్టాలని ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది. ఇంతవరకు కట్టని పన్ను బకాయిలు మొత్తాన్ని వెంటనే చెల్లించాలని నోటీసులు రావడంతో బీహార్ లోని రోహ్తస్కు చెందిన మనోజ్ యాదవ్ ఆశ్చర్యానికి గురయ్యాడు. తాను కూలీ పని తప్పా ఎలాంటి వ్యాపారాలు చేయలేదని, అలాంటిది ఐటీ శాఖ నుంచి నోటీసులు రావడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. కూలిపనులు చేసుకునే బతికే తాను.. ఉన్నదంతా అమ్మినా అంతడబ్బుకట్టలేనని లబోదిబోమన్నాడు. మనోజ్ ఎటువంటి మోసాలకు పాల్పడటం లేదని నిర్ధారించి వెనుదిరగడంతో కథ సుఖాంతం అయ్యింది.
వారిపై అనుమానం
ఉపాధి నిమిత్తం మనోజ్.. హరియాణా, ఢిల్లీ వెళ్తుంటాడు. అక్కడ కాంట్రాక్టర్లకు తన ఆధార్, పాన్ కార్డులను అందించాడు. దీంతో వారిపై అతడు అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. వారేమైన ఫ్రాడ్ చేసి ఉంటారని అధికారులకు తెలిపాడు.దీంతో అధికారులు ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మనోజ్ ఎటువంటి మోసాలకు పాల్పడటం లేదని నిర్ధారించి నోటీసులు వెనక్కు తీసుకున్నారు.