బీహార్‌లో ప్రారంభమైన పోలింగ్.. - MicTv.in - Telugu News
mictv telugu

బీహార్‌లో ప్రారంభమైన పోలింగ్..

October 28, 2020

Bihar Election 2020 LIVE updates

బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికల కోలాహలం మొదలైంది. మూడు విడతల్లో భాగంగా నేడు తొలి విడత పోలింగ్ మొదలైంది. రాష్ట్రంలోని మొత్తం 243 శాసనసభ స్థానాలకు గాను మొదటి విడతలో 71 సీట్లకు పోలింగ్ జరుగుతోంది. ఈ పోలింగ్‌లో మొత్తం 1,066 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వీరిలో 952 మంది పురుషులు కాగా, 114 మంది మహిళలు ఉన్నారు. 

తొలి విడతలో మొత్తం 2 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఓటర్లు కొవిడ్ నిబంధనలు పాటించి ఓటు వేసేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఒక్కో పోలింగ్ కేంద్రం వద్ద గరిష్ఠంగా వెయ్యి మందిని మాత్రమే అనుమతిస్తున్నారు. 80 ఏళ్లు పైబడిన వారికి, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించారు. పోలింగ్ కేంద్రాల వద్ద శానిటైజర్లు, థర్మల్ స్కానర్లు ఏర్పాటు చేశారు.