బిహార్‌లో ఎన్డీఏ ఇంటికే.. ఎగ్జిట్ పోల్స్ వెల్లడి - MicTv.in - Telugu News
mictv telugu

బిహార్‌లో ఎన్డీఏ ఇంటికే.. ఎగ్జిట్ పోల్స్ వెల్లడి

November 7, 2020

Bihar Election Poll Of Exit Polls Live Updates: Opposition Alliance To Win 124 Seats, NDA To Get 110 - Initial Exit Polls

ఉత్కంఠభరితంగా సాగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఈ రోజు జరిగిన మూడో విడత పోలింగ్‌లో 55 శాతం మంది ఓటేశారు. అటు పోలింగ్ ముగియగానే ఇటు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు బయటికొస్తున్నాయి. ఆర్జేడీ, కాంగ్రెస్‌ల సారథ్యంలోని మహాకూటమి స్వల్ప మెజారిటీతో అధికారంలోకి వస్తుందని పలు సర్వేలు చెబుతున్నాయి. బీజేపీకే గెలుపు అవకాశాలు ఉన్నాయని,  ఏదో ఒకటి జరిగి అధికారంలోకి రావొచ్చుని మరికొన్ని అంటున్నాయి. 

అసెంబ్లీలోని మొత్తం 243 స్థానాలకు అధికార ఎన్డీఏ కూటమికి 110 స్థానలు రావొచ్చని టైమ్స్ నౌ అంచనా. మహాకూటమికి 120కి పైగా సీట్లు వస్తాయని ఆ సర్వే చెప్పింది. ఏబీపీ ఫలితాల కూడా మ మహాకూటమికే అనుకూలంగా ఉన్నాయి. కాంగ్రెస్, ఆర్జేడీలకు 131 సీట్లు రావొచ్చని సర్వే తెలిపింది. పీపుల్స్ పల్స్ సర్వేలో మహాకూటమికి 115 సీట్లు దక్కొచ్చని అంచనా.  చిరాగ్ పాశ్వాన్ సారథ్యంలోని ఎల్జీపీ వచ్చే సీట్లు సింగిల్ డిజిట్ దాటవని అన్ని సర్వేలు చెబుతున్నాయి. ఇతరులకు 18 సీట్లు దక్కే అవకాశం ఉందంటున్నాయి. మహాకూటమి గెలిస్తే సీఎం పదవి ఆర్జేడీ నేత, 31 ఏళ్ల యువకుడు తేజస్వీ యాదవ్‌కు దక్కనుంది. తనకు ఇవే చివరి ఎన్నికలని సీఎం నితీశ్ ప్రకటించడం తెలిసిందే.