అమ్మాయిని వెతుకుతున్న లాలు.. - MicTv.in - Telugu News
mictv telugu

అమ్మాయిని వెతుకుతున్న లాలు..

June 12, 2017

హోమ్లీగా ఉండాలి. ఫ్యామిలీలో చక్కగా కలిసిపోవాలి.. పద్దతిగా ఇంటిని చక్కదిద్దుకోవాలి. సినిమాలకు, షాపింగ్ మాల్స్ కు వెళ్లొద్దు..ఇంటిపట్టున్నే అనుకువగా ఉండాలి. పైసా కట్నం అక్కర్లేదు…దేశంలో ఏ ప్రాంతమైనా వోకే..ఇలాంటి లక్షణాలు ఉన్న అమ్మాయిని కోడలిగా కోరుకుంటోంది ఆ కుటుంబం. ఇంతకీ ఎవరు వాళ్లు.. వరుడు అంతా తోపా..?

అనగనగా ఓ రాజకీయ నాయకుడు. ఆయనకు ఏడుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు. మాజీ సీఎం..ప్రాంతీయపార్టీకి అధినేత… గుర్తొచ్చినట్టే వస్తోంది కదూ.. ఆయనే ఆలూలో సమోసా..బీహార్ లో లాలూ ఉండాలనే..లాలూ ప్రసాద్ యాదవ్..ఇప్పుడు ఈయన గురించి సోది ఎందుకంటే..చెప్పుకోవాల్సిన,చర్చించుకోవాల్సిన పనిచేస్తున్నాడు కాబట్టి…

పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ కోసం అమ్మాయిని బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన సతీమణి రబ్రీదేవి వెతుకుతున్నారు. తేజ్ ప్రతాప్ కు సరిజోడిగా సంప్రదాయబద్ధమైన వధువు కోసం సంబంధాలు చూస్తున్నారు. అంతేకాకుండా ఎలాంటి కట్నకానుకలు లేకుండా హోమ్లీగా ఉండి, తమతో చక్కగా కలిసిపోయే అమ్మాయి కోసం సెర్చ్ చేస్తున్నారు. తేజ్‌ ప్రతాప్ ప్రస్తుతం ఆర్యోగ, అటవీ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.

కొడుక్కి పెళ్లి సంబంధాలు చూస్తున్న లాలూ.. పెళ్లిల పేరయ్యనో , బంధువులనో చూడమని చెప్పలేదు.. పుట్టిన రోజుకు వచ్చిన విలేకర్లతో ఏలాంటి కోడలు కావాలో వివరించారు. ఇంతకీ ఆయన ఏం చెప్పారంటే” పద్ధతైన, ఇంటిని చక్కదిద్దుకునే అమ్మాయి కోడలుగా కావాలే కానీ, సినిమాలకు, షాపింగ్ మాల్స్ కు తిరిగే అమ్మాయిలు వద్దు. చాలా సంబంధాలు చూసాం.. అలాగే చాలా పెళ్లి ప్రతిపాదనలు వచ్చాయి.ఇంకా తేజ్ ప్రతాప్ కు సరైన జోడీ దొరకలేదు” అని అన్నారు. అంతే కాదు ..తమ ఇంటికి వచ్చే కోడలు..దేశంలోని ఏ ప్రాంతంవారైనా కావచ్చని, పైసా కట్నం తీసుకోరట.
అమ్మాయిలూ ఇంకెందుకు ఆలస్యం మీలో ఎవరికైనా ఆ లక్షణాలు ఉంటే ఓ రాయి వేస్తే పోలా..ఆల్ ది బెస్ట్..